BJP Support For Chiru : ఆయన మాటల్లో తప్పేముంది - చిరంజీవికి ఏపీ బీజేపీ సపోర్ట్ !
చిరంజీవికి ఏపీ బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆయన అన్నమాటల్లో తప్పు లేదని విష్ణువర్ధన్ రెడ్డి సమర్థించారు.
BJP Support For Chiru : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ మంత్రులు వ్యతిరేకంగా స్పందించారు. అయితే ఆయనకు మద్దతుగా ఏపీ బీజేపీ ముందుకు రావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చిరంజీవి అన్న మాటల్లో తప్పేముందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఆయన చిరంజీవిని సమర్థించడం వైరల్‌గా మారింది
చిరంజీవి గారి వ్యాఖ్యలపై @YSRCParty మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? @KChiruTweets
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 8, 2023
సినిమాలు గురించి చర్చ ఎందుకు? పేదవారి కడుపు నింపండి, అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు .
ఇందులో తప్పేముంది!#IamWithChiru pic.twitter.com/m4BR92u7Rl
పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సాధారణంగా చిరంజీవి సినిమా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఇతర విషయాల గురించి మాట్లాడరు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించడం చర్చనీయమైంది.అదే సమయమంలో తనతో దండం పెట్టించుకున్న అంశాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించారు. పథకాలు అమలు చేసి మంచి చేస్తే ప్రజలే చేతులెత్తి మొక్కుతారని గుర్తు చేశారు. టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో పాల్గొన్న చిరంజీవి.. ప్రభుత్వం తీరుటీవల హీరోల రెమ్యూనరేషన్ల గురించి విజయసాయిరెడ్డి పార్లమెంట్ లోనే ప్రస్తావించారు.
ఇదే సమయంలో ఇటీవలి కాలంలో చిరంజీవితో బీజేపీ సన్నిహితంగా వ్యవహరిస్తోంది. రాజమండ్రిలో జరిగిన అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ప్రధానితో మోదీ చిరంజీవితో ఆప్యాయంగా మాట్లాడిన వైనం వైరల్ అయింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బీజేపీతో చిరంజీవి సంబంధాలు బాగున్నాయని వెల్లడయింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ .. చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు . అయితే చిరంజీవి మాత్రం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పారు. అయితే చిరంజీవి వ్యాఖ్యలను రాజకీయంగా తీసుకుని.. వైసీపీ నేతలు దాడి చేస్తూండటంతో.. ఏపీ బీజేపీ మద్దతుగా రావడం..కొన్ని సమీకరణాలను మార్చే అవకాశం ఉంది.
చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ నడిపే పార్టీ జనసేన.. బీజేపీతో పొత్తులో ఉంది. ఈ కారణంగా.. బీజేపీ ... చిరంజీవికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.