అన్వేషించండి

వారికి బేసిక్ లా తెలియదు - ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదన్నారు ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారే అలా మాట్లాడుతారని మండిపడ్డారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదన్నారు ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారే అలా మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంక్వైరీలో పేరు ఉందా లేదా అనేదే ముఖ్యమని.. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో అంగీకరించారని తెలిపారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు వర్క్ ఫ్రమ్ హోం అనే మెసేజ్‌ను ఇచ్చినట్లుందంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశామని.. ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉందన్నారు సుధాకర్ రెడ్డి. 

రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదన్న ఆరోపణలను సుధాకర్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారిందని, ప్రత్యేకంగా ఒక బ్యారెకె ను కేటాయించారని తెలిపారు. 24 గంటలూ...సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు భద్రతను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, సెంట్రల్ జైల్ అంటేనే పటిష్టమైన భద్రతా ప్రదేశమన్నారు.  చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్‌ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. చంద్రబాబు రిమాండ్‌పై ఆయన తరపు న్యాయవాదులు తీవ్రమైన వాదనలు వినిపించారని ఏఏజీ తెలిపారు. సీఆర్.పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయని, ఒకటి పోలీస్ కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ అని అన్నారు. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదని గుర్తు చేశారు. 

మరోవైపు డిజైన్ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందంలో ఎలాంటి స్కాం జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరఫున ఖన్విల్కర్ వీడియో రిలీజ్ చేశారు. తాము సరఫరా చేసిన పరికరాలకు సంబంధించిన డేటాను ఆయన వీడియోలో వివరించారు. ఏ పరికరాలు నాసిరకంగా ఉన్నా, బాగా లేకున్నా లేదా రిపేరు వచ్చినా.. వాటి పూచికత్తు తీసుకున్నామని వెల్లడించారు. అందుకు సంబంధించి ఒప్పందంలో షరతు ఉందన్నారు. ఏపీ దర్యాప్తు సంస్థలు...ఈ స్కాంకు సంబంధించి తమను సంప్రదించలేదన్నారు. ఆడిటర్లను పంపిస్తే పూర్తి లెక్కలు చూపుతామని ఖన్విల్కర్ వివరించారు. 

చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. జైలులో చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు లాయర్ లూథ్రా. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని తెలిపారు.  ఇంటి కంటే జైలు వద్దే భద్రత ఎక్కువ ఉందన్న ఏఏజీ పొన్నవోలు వ్యాఖ్యలతో జడ్జి ఏకీభవించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు. రిమాండ్ రిపోర్టు లో దాఖలు చేసిన పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అరెస్టు సమయంలో కాల్ రికార్డులను భద్రపర్చాలని మరోమారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Maruti Suzuki E-Vitara: మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Maruti Suzuki E-Vitara: మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Sony PS5 Pro: గేమర్స్‌కు గుడ్ న్యూస్ - మోస్ట్ అవైటెడ్ పీఎస్ 5 ప్రో వచ్చేసింది - రేటు చూస్తే షాకే!
గేమర్స్‌కు గుడ్ న్యూస్ - మోస్ట్ అవైటెడ్ పీఎస్ 5 ప్రో వచ్చేసింది - రేటు చూస్తే షాకే!
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
Embed widget