అన్వేషించండి

YSRCP : చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ - మరో దళిత నేత రాజీనామా

YSRCP : వైఎస్ఆర్‌సీపీకి మరో దళిత నేత రాజీనామా చేశారు. దళితులకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

Another Dalit leader resigned from YSRCP :  చిత్తూరు జిల్లా వైసీపీకి  వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ రాజీనామా చేశారు.  మెయిల్ ద్వారా జగన్ రెడ్డికి రాజీనామా పంపిపిన మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ  మీడియా సమావేశంలో వైసీపీ హైకమాండ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.  
12 ఏళ్లుగా వైసీపీలో ఉన్నారు ఆర్. గాంధీ.  వైసీపీ లో దళితులకు అన్యాయం జరుగుతోందని..  దళితుల బాధలను, కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే అపాయింట్మెంట్ దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  గత నెల రోజుల్లో సుమారు వెయ్యి సార్లు జగన్ రెడ్డికి కాల్ చేశాను కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. 

12 ఏళ్లుగా వైసీపీలో ఉన్న  ఆర్.గాంధీ                                   

ఓ దళిత మాజీ ఎమ్మెల్యేని అయిన నాకు వైసీపీలో అవమానం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానని ప్రకటించారు.  నాడు అమర్నాథ్ రెడ్డి   ఆధ్వర్యంలో నేను వైసీపీలో చేరాను.  అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తనను చిన్నచూపు చూస్తూ వస్తున్నారని విమర్శించారు.  పార్టీ పరంగా దక్కాల్సిన అవకాశాలను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దూరం చేస్తూ, అడ్డుపడుతూ వచ్చారని..  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితుల పైన, బీసీల పైన దాడులు పెరిగాయిని  విమర్శించారు.  వైసీపీ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా నేడు నేను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. 

పెద్దిరెడ్డికి బానిసత్వం చేసే వారికే టిక్కెట్లు                             

చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గంగాధర నెల్లూరులో జరగనున్న  రా... కదలిరా... సభలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాననని తెలిపారు.  దళితులకు ఈ ప్రభుత్వం దగా చేస్తుంది, దీనిని ప్రశ్నించేందుకు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను.  నేడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం నడుస్తోందన్నారు.  పెద్దిరెడ్డికి బానిసలుగా ఉన్నారో, అనుకూలంగా ఉన్నారో వారికి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీట్లు వస్తున్నాయని మండిపడ్డారు.  జిల్లాలో వైసీపీకి  కోనేటి ఆదిమూలం గొప్ప సర్వీస్ చేశారు. అలాంటి దళిత నాయకుడికి కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.  పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకి కూడా సీటు లేకుండా చేశారు.  వైసీపీలో కేవలం దళిత ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.  వైసీపీ చేస్తున్న అవినీతి, అక్రమాల మీద పోరాటం చేస్తానని  ప్రకటించారు. 

చిత్తూరు జిల్లా వైసీపీలో టిక్కెట్ల మార్పు కలకలం     

చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్ల మార్పు వ్యవహారం కలకలం రేపుతోంది. ముందుగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను మార్చడం వివాదాస్పదమవుతోంది. డిప్యూటీ సీఎంకు కూడా మొదట ఎంపీ టిక్కెట్ ప్రకటించి తర్వాత ఎమ్మెల్యేగా మార్చారు. సత్యవేడు ఎమ్మెల్యేకూ అదే విధంగాచేయడంతో ఆయన మనస్తాపానికి గురై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget