Annamayya MLA Winner List 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల 2024 ఫలితాల్లో అన్నమయ్యజిల్లా వైసీపీకి ఊపిరి ఇచ్చింది
Andhra Pradesh Assembly Election Results 2024: రాష్ట్రమంతటా కూటమి గాలి వీస్తే అన్నమయ్య జిల్లాలో మాత్రం రెండు చోట్ల ఫ్యాన్ గాలి వీచింది. ఈ జిల్లాలో ఇద్దరు విజయం సాధించారు.
Annamayya Constituency MLA Winner List 2024: అన్నమయ్య జిల్లాలో ఆరు స్థానాలు ఉంటే అందులో మూడు స్థానాలను టీడీపీ ఎగరేసుకుపోతే... రెండింటిని వైసీపీ గెల్చుకుంది. మరో స్థానం జనసేన జయకేతనం ఎగరేసింది. రాష్ట్రమంతటా వైసీపీ కుప్పకూలినా ఇక్కడ మాత్రం ఇద్దరు అభ్యర్థులు ఆ గాలిని తట్టుకొని నిలబడ్డారు.
నియోజకవర్గం |
విజేత |
పార్టీ |
కోడూరు |
అరవ శ్రీధర్ |
జనసేన |
రాజంపేట |
ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి |
వైసీపీ |
రాయచోటి |
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి |
టీడీపీ |
పీలేరు |
నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి |
టీడీపీ |
మదనపల్లె |
షాజహాన్ బాషా |
టీడీపీ |
తంబళ్లపల్లె |
పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి |
వైసీపీ |
రాయలసీమ ప్రాంతంలోని మరో కీలక జిల్లా అన్నమయ్య. రాజంపేట పార్లమెంటు స్థానం ఇదే జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతోపాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. గడచిన మూడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి, ఆ తరువాత ఏర్పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానంగా ఉంటూ వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా, పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే తరహా ఫలితాలను ఇక్కడ నమోదు చేసింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అదే విధంగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా, పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం నమోదు చేశారు. ఒక్క స్థానంలో కూడా టిడిపి అభ్యర్థి విజయం సాధించ లేదు. అలాగే 2012 లో కోడూరు, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన బలాన్ని పెంచుకుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు బిజెపి కూడా జత కలవడంతో కూటమి బలోపేతం అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బిజెపి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగగా, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా అన్నమయ్య జిల్లాలో 77.80 పోలింగ్ ఈసారి నమోదయింది. పెరిగిన పోలింగ్ తమకే అనుకూలిస్తుందని ఇటు కూటమి, అటు వైసిపి చెబుతూ వస్తోంది.
అన్నమయ్య జిల్లా
|
2009 |
2014 |
2019 |
కోడూరు |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
రాజంపేట |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
రాయచోటి |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
పీలేరు |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
మదనపల్లె |
కాంగ్రెస్ |
వైసీపీ |
|
తంబళ్లపల్లె |
వైసీపీ |