అన్వేషించండి

Anganwadi Workers Protest: పండుగ రోజు నడిరోడ్డుపైకి తెచ్చారు, ఎన్నికల్లో మేమేంటో చూపిస్తాం: అంగన్వాడీలు

Anganwadis Protest: అంగన్వాడీలు రోడ్లపై ముగ్గులు వేసి, రంగు రంగుల ముగ్గుల రూపంలో తమ సమస్యలను రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా  కూడలిలో ముగ్గులు వేసి నిరసనకు దిగారు.

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 35వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సంక్రాంతి పండుగ రోజు సైతం సమ్మె కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా ఏపీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. అంబేడ్కర్ జంక్షన్ లో రోడ్లపై ముగ్గులు వేసి, రంగు రంగుల ముగ్గుల రూపంలో తమ సమస్యలను రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా  కూడలిలో ముగ్గులు వేసి నిరసనకు దిగారు. 35 రోజులుగా ఆందోళన చేస్తున్నా వేతనాలు పెంచలేదని, తమ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించడం లేదని ముగ్గుల రూపంలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తమను పండుగ కూడా జరుపుకోనివ్వడం లేదన్నారు అంగన్వాడీలు. పండుగ రోజున ఇంట్లో కాకుండా, తమను నడిరోడ్డుపైన ఉండేలా చేసిన జగన్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం అన్నారు. 

దీక్షా శిబిరాల వద్దే అంగన్వాడీలు వంటా వార్పు 
కృష్ణా, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల్లో అంగన్వాడీలు దీక్షా శిబిరాల వద్దే అంగన్వాడీలు వంటా వార్పు చేశారు. నందిగామలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆందోళన శిబిరం వద్దే పండుగ సందర్భంగా పొంగలి వండి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని.. వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోవడంతో పండుగ రోజు కూడా రోడ్ల మీదకు వచ్చి దీక్షలు చేయాల్సి వస్తోందన్నారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. 
రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే పలు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఎన్నికల తరువాత జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అంగన్వాడీల పలు డిమాండ్లను నెరవేర్చిందని, రెండు మూడేళ్లకు ఓసారి జీతాల పెంపు సాధ్యం కాదని.. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వేతనాలను ప్రభుత్వం పెంచుతుందని చెప్పడం తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Unanimous Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల రచ్చ - వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపణలపై లభించని సానుభూతి - నాడు ఇలా చేయడమే కారణమా?
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల రచ్చ - వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపణలపై లభించని సానుభూతి - నాడు ఇలా చేయడమే కారణమా?
AP Cyclone Arnab Relief Package: ఆర్నాబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ప్యాకేజీ - ఎవరికి ఎంత సాయం? పూర్తి వివరాలు!
ఆర్నాబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ప్యాకేజీ - ఎవరికి ఎంత సాయం? పూర్తి వివరాలు!
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Embed widget