అన్వేషించండి

AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!

Vizag Suryalanka Beach Bars GO: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీచ్ షాక్స్ బార్ లైసెన్స్ పాలసీ తీసుకు వచ్చింది. వైజాగ్, సూర్యలంక తీరంలో తాత్కాలిక బార్లకు అనుమతి ఇస్తారు. లైసెన్స్ ఫీజు, నిబంధనలను జీవోలో పొందు పరిచారు.

Eco Friendly Beach Shacks Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం రూపురేఖలను మార్చేందుకు సరికొత్త అడుగులు వేస్తోంది. గోవా సంస్కృతిని తలపించేలా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొస్తూ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు  జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ నిబంధనలను సవరించిన ఏపీ ప్రభుత్వం.. ప్రాథమికంగా బాపట్లలోని సూర్యలంక, విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసరాల్లో ఈ సరికొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేయబోతోంది.
 
  పైలట్ ప్రాజెక్ట్‌గా వైజాగ్, సూర్యలంక.. గ్రీన్ కట్టడాలకే చాన్స్! 

రాష్ట్రంలో తీరప్రాంత పర్యాటకాన్ని  లాభసాటిగా మార్చడం , స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏపీ సచివాలయం ఈ పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా తొలి దశలో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో 2, విశాఖపట్నం తీరంలో 2 బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, కేవలం పర్యావరణ అనుకూల తాత్కాలిక సామగ్రితో  మాత్రమే వీటిని నిర్మించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంక్రీట్ కట్టడాలు చేపట్టడానికి వీల్లేదని ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది.

 స్థలం పరిమితి.. కఠినమైన అనుమతులు తప్పనిసరి! 

బీచ్‌లలో ఇష్టారాజ్యంగా షాక్స్ నిర్మించకుండా ప్రభుత్వం స్థలం పరిమితిని కూడా విధించింది. ఒక్కో బీచ్ షాక్ కనీసం 1,000 నుండి గరిష్టంగా 1,500 చదరపు అడుగుల  విస్తీర్ణంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా, సముద్ర తీర నిబంధనల ప్రకారం అత్యంత కీలకమైన సిఆర్ జెడ్  క్లియరెన్స్‌తో పాటు లోకల్ ట్రేడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార భద్రత అనుమతి,   ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందడం ఈ షాక్స్ నిర్వహణకు తప్పనిసరి అని జీవోలో స్పష్టం చేశారు.

 కేవలం లైట్ లిక్కర్ మాత్రమే.. టైమింగ్స్ ఇవే! 

బీచ్ పరిసరాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మద్యం విక్రయాలపై ప్రభుత్వం పక్కా ఆంక్షలు పెట్టింది. ఈ బీచ్ షాక్స్‌లో సాధారణ   IMFL - ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ , నాటు సారా లేదా ఇతర ఘాటైన విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలు, అంటే.. బీర్, వైన్ , రెడీ-టు-డ్రింక్ పానీయాలు మాత్రమే ఇక్కడ విక్రయించాలి. అలాగే, మద్యం సరఫరా సమయాన్ని కూడా పరిమితం చేస్తూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

 భారీ లైసెన్స్ ఫీజు.. మూడేళ్ల కాలపరిమితి! 

ఈ ప్రీమియం బీచ్ షాక్ బార్ లైసెన్స్ వార్షిక రుసుమును ప్రభుత్వం భారీగానే ఖరారు చేసింది. ఏడాదికి 75 లక్షల రూపాయలు  లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. అంతేకాకుండా, ఈ ఫీజు ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెరుగుతుంది. ఈ లైసెన్సులు మొత్తం మూడేళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో బీచ్ టూరిజం బ్రాండింగ్ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోవా తరహా టూరిజం.. సరికొత్త అనుభూతి! 

ఇప్పటివరకు గోవా, పాండిచ్చేరి లాంటి ప్రాంతాలకే పరిమితమైన బీచ్ లైఫ్ అనుభూతిని.. ఇకపై మన ఏపీ తీరంలోనే పర్యాటకులు ఆస్వాదించవచ్చు. పచ్చని తాత్కాలిక షెడ్లు, సముద్రపు గాలుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు గడిపేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో నెల్లూరు మైపాడు, కాకినాడ ఎన్టీఆర్ బీచ్, ప్రకాశం జిల్లా రామాపురం లాంటి మరికొన్ని ప్రముఖ తీర ప్రాంతాలకు కూడా ఈ  బీచ్ షాక్స్  విధానాన్ని విస్తరించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Embed widget