Breaking News Live: పిచ్చికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
టీడీపీ నేత కూన రవికుమార్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నిరసనల సందర్భంగా నిన్న కూన రవికుమార్‌ను పోలీసులు గృహానిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, రవి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 టౌన్ సీఐ ప్రసాదరావుపై దుర్భాశలాడారంటూ కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున రవి నివాసానికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కూన రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వరదలో చిక్కుకున్న సినిమా టీమ్
నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద షూటింగ్ కోసం వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది. నటుడు నవీన్ కుమార్ .. వరదల్లో చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘3 నెలల షూటింగ్ కోసం కోవూరు వచ్చాం. కోవూరు బ్రిడ్జి సమీపంలోని ఓ భవనంలో నాతో పాటు 30 మంది వరకు ఉన్నాం. మేం ఉన్న ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దయచేసి సహాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెగిన జాతీయ రహదారి
భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తడంతో వరదనీరు నెల్లూరుపై ప్రతాపం చూపించింది. ఇప్పటికే నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ క్రమంలో వరదనీరు రోడ్లపైకి పోటెత్తింది. ఈ ప్రవాహ ఉధృతికి ఏకంగా హైవేలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు-ముంబయి హైవే వరద నీటిలో మునిగిపోగా.. తాజాగా నెల్లూరు - విజయవాడ రహదారి మార్గానికి ఏకంగా గండి పడింది.
పెన్నా నదిపై ఉన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత కోవూరు సమీపంలో నెల్లూరు - విజయవాడ హైవే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అటు నెల్లూరు - గూడూరు మధ్య కూడా వరద నీటికి రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే హైవేపై నిలిచిపోయాయి. ఇటు నెల్లూరు - విజయవాడ మార్గం కూడా ఇప్పుడు కొట్టుకుపోవడంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరి నిలిచిపోయాయి.
నెల్లూరు - కావలి - ఒంగోలు వైపు వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారి పైకి శనివారం వరదనీరు వచ్చి చేరింది. రాత్రి ఒకటిన్నర గంటల సమయానికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రోడ్డుకి గండి పడింది. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి.
ప్రత్యామ్నాయం లేదు..
నెల్లూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డారు అధికారులు. నెల్లూరు నగరం పైనుంచి కోవూరు చేరుకునే అవకాశం ఉంది. అయితే వాహనాలతో నెల్లూరు నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు ఏం చేయాలా అని తలలు పట్టుకున్నారు. మరోవైపు పామూరు, వింజమూరు నుంటి ట్రాఫిక్ మళ్లించాలనుకుంటున్నా.. నెల్లూరు - ముంబయి హైవేపై వరదనీరు భారీగా ఉంది. నీటి మట్టం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు.
రహదారికి మరమ్మతులు చేయాలన్నా కూడా ఇప్పుడల్లా సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. గండి పడిన చోట వరద తీవ్ర ఉధృతంగా ఉంది. దీంతో మరమ్మతులకు అవకాశం లేదు. మరమ్మతులకు కనీసం మరో 48 గంటలు సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. అప్పటి వరకు హైవేపై ప్రయాణికులు అల్లాడిపోవాల్సిందే.
ఇక సోమశిల నుంచి పెన్నా నదికి విడుదల చేసే నీటి పరిమాణం 3 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో క్రమక్రమంగా పెన్నా నది శాంతిస్తోంది. అయితే ఇప్పటికే నీరు నిలబడిపోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రహదారులు సైతం తెగిపోవడంతో వాహనాలు ఆగిపోయి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
పిచ్చికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలికపై పిచ్చి కుక్క దాడి చేసి దారుణంగా కరిచింది. ఒక్కసారిగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే కుక్క విచక్షణారహితంగా గాయపరిచింది. పిచ్చికుక్క కోసం గ్రామస్తులు వెదుకుతున్నారు. అదే గ్రామంలో ఓ లేగదూడను, నాలుగు పందెం కోడిపుంజులను పిచ్చి కుక్క గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయాల పాలైన చిన్నారిని అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుక్క దాడిలో తీవ్రగాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.
పిచ్చికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలికపై పిచ్చి కుక్క దాడి చేసి దారుణంగా కరిచింది. ఒక్కసారిగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే కుక్క విచక్షణారహితంగా గాయపరిచింది. పిచ్చికుక్క కోసం గ్రామస్తులు వెదుకుతున్నారు. అదే గ్రామంలో ఓ లేగదూడను, నాలుగు పందెం కోడిపుంజులను పిచ్చి కుక్క గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయాల పాలైన చిన్నారిని అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుక్క దాడిలో తీవ్రగాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.





















