అన్వేషించండి

Breaking News Live: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన 11 మంది ప్రయాణికులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన 11 మంది ప్రయాణికులు

Background

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో విజయనగరం ఎమ్మెల్సీ రంగరాజు., పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు., తెలంగాణ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ., ప్రభుత్వ సలహా దారుడు అజయ్ కల్లమ్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

తల్లిదండ్రుల నిరసన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పై కప్పు నుండి పెచ్చులు ఉడి పడుతుండటంతో తమ పిల్లలను బడులకు పంపలేమంటూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలలో 235 మంది విద్యార్థులు 9 మంది ఉపాధ్యాయులు గాను ఏడు గదులు ఉన్నాయి. ఇందులో అన్ని గదులు శిథిలావస్థకు చేరాయి. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని రోజు బయపడుతూనే ఉన్నారు. ఇలా ఉంటే ప్రాణాలు పణంగా పెట్టి తమ పిల్లలను బడులకు పమపలేమని, కావాలంటే తమ పిల్లలకు గుడిలో, చెట్ల కింద చదువులు నేర్పాలన్నారు. ఈ పాఠశాలపై ఎన్ని సార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లిని పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి పాఠశాల నూతన భవనం ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ప్రధాని సీఎం కేసీఆర్ లేఖ
సింగరేణిలో చేపట్టబోయే నాలుగు గనుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈమేరకు పూర్తి వివరాలతో లేఖ రాశారు. కోల్స్‌ బ్లాక్స్‌ వేలాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులు నోటీసులు ఇచ్చారు. వేలం ప్రక్రియ వెనక్కి తీసుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరించాయి. గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ నేేపథ్యంలోనే ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. 

ప్రతి సంవత్సరం 65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ జూన్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

సింగరేణి బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులు మంజూరు చేసిందన్న ముఖ్యమంత్రి.. అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కేంగ్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచ్‌ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జీబీఆర్‌ఓసీ-3, శ్రావన్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 4 కోల్‌  బ్లాక్స్‌ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

21:52 PM (IST)  •  09 Dec 2021

Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణికులు

నెల్లూరు జిల్లా సంగం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టింది. 15 మందితో ప్రయాణిస్తున్న ఆటో వాగులో పడిపోయింది. వాగులో నుంచి స్థానికులు నలుగురిని కాపాడారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాపాడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

17:08 PM (IST)  •  09 Dec 2021

శబరిమలై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... కర్నూలుకు చెందిన ఇద్దరు మృతి

శబరిమలై సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి శబరిమలై వెళ్తోన్న టెంపోను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్నూలుకు చెందిన ఆది నారాయణ, ఈశ్వర్  అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. కర్నూలుకు చెందిన 11 మంది అయ్యప్ప స్వాములు టెంపో వాహనంలో బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శబరిమలై వెళ్లారు. శబరిమలైకు అరవై కిలోమీటర్ల దూరంలో ఇడుక్కి జిల్లా పెరువంతనం వద్ద ఉదయం పది గంటల సమయంలో టెంపో వాహనం రోడ్డు పక్కన ఆపి టీ తాగు తుండగా టెంపోను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. శబరిమలై వెళ్లిన పదకొండు మందిలో ఐదుగురు అయ్యప్ప మాల ధరించినవారు, మిగిలిన ఆరుగురు సాధారణ భక్తులు ఉన్నారు. 

16:11 PM (IST)  •  09 Dec 2021

దొనకొండ సమీపంలోని ఫాబెక్స్ కంపెనీలో అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనకొండ నుంచి ఏలూరు వెళ్లే రహదారిలో ఫాబెక్క్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా సమీపంలో నివసించే ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు బయటకి రావాల్సి ఉంది

14:13 PM (IST)  •  09 Dec 2021

బిపిన్ రావత్‌కు గవర్నర్ తమిళిసై నివాళి

నీల‌గిరి జిల్లాలో ఉన్న మ‌ద్రాస్ రెజిమెంట్ సెంట‌ర్‌లో వీర‌ సైనికుల భౌతిక‌కాయాల‌కు గార్డ్ ఆఫ్ హాన‌ర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవ‌దేహాల ముందు పుష్ప‌గుచ్చం ఉంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై త‌న ట్విట్ట‌ర్‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతి ప‌ట్ల ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ఆర్మీ సిబ్బంది కూడా ఆమె నివాళి అర్పించారు.

11:24 AM (IST)  •  09 Dec 2021

సింగ‌రేణి ప్రదాన కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్తత‌

కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకుల‌ను ప్రైవేట్ ప‌రం చేయాల‌ని తీసుకున్న నిర్ణయం వెన‌క్కు తీసుకోవాల‌ని కోరుతూ సింగ‌రేణి అన్ని కార్మిక సంఘాలు చేప‌ట్టిన మూడు రోజుల స‌మ్మె విజ‌య‌వంతం అయింది. తొలిరోజు అన్ని గ‌నుల వ‌ద్ద నిర‌స‌న తెలిపిన కార్మిక సంఘాలు, విధులు బ‌హిష్కరించారు. సింగ‌రేణి ప్రధాన కార్యాల‌యం వ‌ద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యాల‌యం ముట్టడి నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి ప్రధాన కార్యాల‌యంలోకి వెళ్లేందుకు వ‌చ్చిన ఉద్యోగుల‌ను అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెన‌క్కు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా అన్ని సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘం నాయ‌కులు అధికారుల సంఘం మ‌ద్దతు కోరారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu Davos Tour : ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Adilabad Latest News : అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP DesamCM Chandrababu on Population | పెద్ద కుటుంబమే పద్ధతైన కుటుంబం | ABP DesamMohammed shami Jasprit Bumrah CT 2025 | నిప్పులాంటి బుమ్రా...పెను తుపాన్ షమీ తోడవుతున్నాడు | ABP DesamTeam India Squad Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu Davos Tour : ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Adilabad Latest News : అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
Ram Mohan Naidu News: టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు- వారికి గుడ్‌బై చెప్పేస్తారా!
టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు- వారికి గుడ్‌బై చెప్పేస్తారా!
Telangana News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మరో పథకం
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మరో పథకం
Amit Shah Andhra Pradesh visit : ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
Rules in EPF : ఈపీఎఫ్ఓ మెంబర్స్ కి గుడ్ న్యూస్ - ఇక నుంచి మీ పర్సనల్ డిటెయిల్స్ ను ఈజీగా ఛేంజ్ చేయొచ్చు
ఈపీఎఫ్ఓ మెంబర్స్ కి గుడ్ న్యూస్ - ఇక నుంచి మీ పర్సనల్ డిటెయిల్స్ ను ఈజీగా ఛేంజ్ చేయొచ్చు
Embed widget