Breaking News Live: బద్వేల్ ఉపఎన్నికకు టీడీపీ దూరం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 4.45 గంటలకు ఇడుపులపాయకు వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాష్ రెడ్డి, చంద్రగిరి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, బిజేంద్రనాథ్ రెడ్డి పలువురు నేతలు స్వాగతం పలికారు. ఆదివారం పులివెందులలో వైద్యుడు, తన మామ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
హైదరాబాద్ లో కారు బీభత్సం... బైక్ ను ఢీకొట్టిన కారు, యువతి మృతి
హైదరాబాద్ లో కారు బీభత్సవం సృష్టించింది. సీఐఐ జంక్షన్ లో బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మృతి చెందగా, యువకుడికి గాయాలయ్యాయి.
బద్వేల్ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో పోటీచేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినా.. తాజాగా పోటీకీ దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది. మృతి చెందిన ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది.





















