AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు, ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో 4,649 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,054 మంది నమూనాలు పరీక్షించగా 349 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇద్దరు మంది మరణించారు. కరోనా నుంచి 535 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,649 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణాలో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారని పేర్కొంది.
#COVIDUpdates: 30/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 30, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,63,170 పాజిటివ్ కేసు లకు గాను
*20,44,152 మంది డిశ్చార్జ్ కాగా
*14,369 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,649#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7CR5kWnazv
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,065కి చేరింది. వీరిలో 20,47,047 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 535 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,369కు చేరింది.
Also Read: హిందూ దేవతలపై అభ్యంతరకర పోస్టులు... తొలగించాలని ట్విట్టర్ ను కోరిన దిల్లీ హైకోర్టు
దేశంలో కరోనా కేసులు
దేశంలో రోజువారి కోవిడ్ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ధాటికి మరో 549 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 13,543 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా శుక్రవారం 11,76,850 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 60,69,59,807కు చేరినట్లు ఐసీఎంఆర్ప్రకటించింది. టీకా పంపిణీ కొత్తగా 56,91,175 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,05,43,13,977కు చేరినట్లు ప్రకటించింది.
India reports 14,313 new COVID19 cases, 549 deaths and 13,543 recoveries in last 24 hours; Active caseload stands at 1,61,555: Union Health Ministry pic.twitter.com/NNR9Fa2eI7
— ANI (@ANI) October 30, 2021
Also Read: పోప్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఇండియాకు రావాలని ఆహ్వానం