Corona Updates: ఏపీలో కనిష్టానికి కోవిడ్ కేసులు... కొత్తగా 82 కేసులు, ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు. రాష్ట్రంలో 1166 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
![Corona Updates: ఏపీలో కనిష్టానికి కోవిడ్ కేసులు... కొత్తగా 82 కేసులు, ఒకరు మృతి Andhra Pradesh Telangana latest corona omicron updates 26th December records 82 new covid 19 cases one death in 24 hours Corona Updates: ఏపీలో కనిష్టానికి కోవిడ్ కేసులు... కొత్తగా 82 కేసులు, ఒకరు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/05cf67af42f1c10c7514a8f68fcf592c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 25,086 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 82 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,490కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 164 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,836 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1166 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 26/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 26, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,597 పాజిటివ్ కేసు లకు గాను
*20,57,941 మంది డిశ్చార్జ్ కాగా
*14,490 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,166#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HuVwmc4nKG
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,492కి చేరింది. గడచిన 24 గంటల్లో 164 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,490కు చేరింది.
Also Read: Vaccination: అతి త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా.. 'భారత్ బయోటెక్' కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో 60 ఏళ్ల వయసు దాటిన, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రికాషన్ డోసు అందిస్తామని తెలిపింది. రెండోడోసు తీసుకున్న తర్వాత ప్రికాషన్ డోస్ ఎంత సమయంలో ఇస్తారో ప్రస్తుతానికి స్పష్టత లేదు. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలలు మధ్యకాలంలోనే ఈ ప్రికాషన్ డోసు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్, కోవిడ్ తీవ్రతపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. 15-18 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకా పంపిణీ జనవరి 3న ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఒమిక్రాన్ వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకే 60 ఏళ్ల వయసు దాటిన, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై ప్రికాషన్ డోసు టీకా అందిస్తామన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రికాషన్ డోసు జనవరి 10 నుంచి వ్యాక్సిన్లు వెల్లడించారు.
Also Read: జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా.. 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్
Also Read: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)