అన్వేషించండి

Breaking News Live Updates : ఏపీ హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా హరీష్‌ కుమార్‌ గుప్తా బదిలీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana breaking news live updates on 18th May 2022 Breaking News Live Updates : ఏపీ హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా హరీష్‌ కుమార్‌ గుప్తా బదిలీ
తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్

Background

Weather Updates : నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలో మరింతగా నైరుతి పవనాలు విస్తరించాయని భారత వాతావరణశాఖ(IMD) తెలిపింది. నైరుతీ రుతుపవనాల ఉత్తర పరిమితి అండమాన్ నుంచి లాంగ్ ఐలాండ్స్ వరకు విస్తరించినట్టు పేర్కొంది. దీంతో రాగల రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం(Bay Of Bengal), అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్ లో 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ(Kerala), కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల(Telugu States)కు ఈసారి ముందస్తుగా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని చాలా చోట్ల రుతుపవనాల కారణంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో ఏపీ(Andhra Pradesh)లో ఉరుములతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో 

విదర్భ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ(Telangana)లో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుప‌వ‌నాలు రెండు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు 

నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు, 5 జిల్లాల్లో 39 డిగ్రీలకు పైన, మరో 5 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 42.8 డిగ్రీలు, కొత్తగట్టులో 42.7, ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 42.6, ఆదిలాబాద్‌ 42.6 డిగ్రీల పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. 

 

19:14 PM (IST)  •  18 May 2022

AP News: ఏపీ హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా హరీష్‌ కుమార్‌ గుప్తా బదిలీ

అమరావతి: రైల్వే డీజీపీగా ఉన్న హరీష్‌ కుమార్‌ గుప్తాను హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. హోమ్‌శాఖ కార్యదర్శిగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను రైల్వే అడిషనల్‌ డీజీగా ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

17:11 PM (IST)  •  18 May 2022

AP Ministers Bus Tour: మే 26, 27, 28, 29 తేదీల్లో ఏపీ మంత్రుల  బస్సు యాత్ర !

AP Ministers Bus Tour: మే 26, 27, 28, 29 తేదీల్లో ఏపీ మంత్రుల  బస్సు యాత్ర !
రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు చేపట్టాలని ఏపీ మంత్రులు భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. సాగర నగరం  విశాఖ నుంచి మంత్రుల బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. మే నెల 26, 27, 28, 29 తేదీల్లో ఏపీ మంత్రులు బస్సు యాత్ర చేయనున్నట్లు సమాచారం.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget