By: ABP Desam | Updated at : 07 Sep 2021 10:29 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ హైకోర్టు(ఫైల్ ఫొటో)
ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలకు బ్రేక్ పడింది. ఇంటర్ విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశాల కోసం ఆగస్టు 10న ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దుచేసింది. ఈ ఏడాది ప్రవేశాలకు పాత విధానాన్నే అమలుచేయాలని తెలిపింది. భవిష్యత్తులో ఇంటర్ ప్రవేశాలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు సోమవారం ఈ తీర్పు ఇచ్చారు. ఆన్‌లైన్ ప్రవేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇంటర్ విద్యా మండలికి బదలాయించడం చట్టప్రకారం చెల్లదని కోర్టు తెలిపింది. కరోనా కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల భద్రత నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యా మండలి ఈ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని స్పష్టం చేసింది.
చట్టబద్ధత లేదు
ఆన్లైన్ ప్రవేశాలపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదని కోర్టు తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను ఉత్తీర్ణులు చేశామని, ఇప్పుడు ప్రతిభ ఆధారంగా ఇంటర్ ప్రవేశాలు నిర్వహిస్తామని చెప్పడంలో అర్థం లేదని తెలిపింది. ఇప్పటికే లక్షల మంది ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారన్న కారణంతో నిబంధనలకు అనుగుణంగా లేని నోటిఫికేషన్ ను సమర్థించలేమని తెలిపింది. ఆన్‌లైన్ ప్రవేశాలపై సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, కొందరు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ, న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు.
కోవిడ్ ఒక సాకు
పిటిషన్లలలో ఆన్‌లైన్ ప్రవేశాలకు ఇంటర్ బోర్డు సరైన విధివిధానాలు రూపొందించలేదని పేర్కొన్నారు. పత్రికా ప్రకటన ద్వారా ఇంటర్ బోర్డు ఆన్‌లైన్ ప్రవేశాల విధానాన్ని వెల్లడించిందన్నారు. గతేడాది ఇలాగే చేస్తే హైకోర్టు తప్పుపట్టిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు చెబుతోందని, అలాంటప్పుడు ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడం కోసం కోవిడ్‌ను ఓ సాకుగా చెబుతున్నారన్నారు. విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంచుకునే హక్కును ఆన్ లైన్ ప్రవేశాల ద్వారా హరిస్తున్నారని పిటిషనర్లు తెలిపారు. ఈ పిటిషన్లపై ఇరు వాదనలు విన్న హైకోర్టు సోమవారం తుదితీర్పు ఇచ్చింది. ఇంటర్మీడియట్ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆన్‌లైన్ విధానాన్ని ఇంటర్ బోర్డు తీసుకువచ్చిందన్నారు. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరిగి ఇబ్బందిపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు తెలిపారు.
Chittoor Crime: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లిన వృద్ధుడు, ఆపై దారుణం ! తల్లి రాగానే అక్కడినుంచి పరార్
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం