News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan Review: పోర్టులు, ఎయిర్‌పోర్టులు నిర్దేశిత సమయంలోపు పూర్తి కావాలి.. సమీక్షలో సీఎం జగన్ ఆదేశం

రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

FOLLOW US: 
Share:

ఏపీలో మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. అక్టోబరు నెలకల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని, అప్పటికల్లా పనుల కాలం మొదలవుతుంది కాబట్టి.. రోడ్లపై కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘‘మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విస్మరించారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడడం వల్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంది. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది’’ అని జగన్ అన్నారు.

‘‘దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు మనం పచ్చమీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే.. నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు. మనం బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండి.

అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి. క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండి. మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించండి. నివేదికల ఆధారంగా ఫోకస్‌ పెట్టి వాటిని బాగుచేయండి. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చొని కార్యాచరణ చేయండి. బ్రిడ్జిల వద్ద అప్రోచ్‌ రోడ్లు పూర్తికాక చాలా రోడ్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. చాలా సంవత్సరాలుగా ఇవి అలానే ఉండిపోయాయి. నా పాదయాత్రలో వాటిని చాలా చోట్ల చూశాను. వీటిని వెంటనే పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసి, పనులు పూర్తిచేయాలి.

మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్లతో మంచి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో రూ.6,400 కోట్ల ఖర్చుతో కొత్త రోడ్లకు కార్యాచరణ ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. 

రహదారుల ప్రగతిపై వివరాల అందజేత
రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రగతి, ప్రతిపాదనలపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్‌లో చేపడుతున్నామని అధికారులు అన్నారు. విశాఖపట్నంలో షీలానగర్‌ – సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. విశాఖపట్నం సిటీ గుండా అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధానమైన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమయ్యామని అధికారులు తెలిపారు. దీనివల్ల సిటీలో ట్రాఫిక్‌ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. 

నడికుడి – శ్రీకాళహస్తి, కడప– బెంగళూరు, కోటిపల్లి–నర్సాపూర్, రాయదుర్గ్‌ – తుంకూర్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
మరికొన్ని మార్గాల్లో డబ్లింగ్‌ పనులు ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పోర్టుల నిర్మాణంపైనా సీఎం సమీక్ష
రాష్ట్రంలోని పోర్టులు, వాటి ద్వారా సరకు రవాణా తదితర అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. పోర్టులతో రోడ్లు, రైల్వేల అనుసంధానంపై సీఎంకు వివరాలు అందించారు. ఇందులో భాగంగా రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, పోర్టులపై సీఎం సమీక్ష చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. మొదటి విడతలో భాగంగా 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేస్తామని తెలిపారు.

అక్టోబరు 1 నుంచి రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. బ్రేక్‌ వాటర్‌ పనులు నవంబర్‌ మొదటి వారంలో మొదలుపెడతామని చెప్పారు. వచ్చే మే నాటికి కీలకమైన పనులు పూర్తిచేస్తామని.. భూ సేకరణ పనులు, సహాయ పునరావాస పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. పోర్టుల వద్ద కాలుష్యాన్ని నియంత్రించాలని సీఎం కోరగా.. దీనిపై కొత్తగా నిర్మించనున్న పోర్టుల వద్ద ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కె వెంకటరెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Published at : 06 Sep 2021 07:24 PM (IST) Tags: cm jagan Andhrapradesh news CM Jagan Review CM Jagan News cm review on Roads

ఇవి కూడా చూడండి

APCTD: తిరుపతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

APCTD: తిరుపతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

Chittoor News: నాటుకోళ్ళకి పోస్టుమార్టం, వీళ్ల పంచాయితీతో పోలీసులకు తలనొప్పి!

Chittoor News: నాటుకోళ్ళకి పోస్టుమార్టం, వీళ్ల పంచాయితీతో పోలీసులకు తలనొప్పి!

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

AP CM Jagan : 13 లక్షల కోట్ల పెట్టుబడులు 6 లక్షల ఉద్యోగాలు - ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

AP CM Jagan : 13 లక్షల కోట్ల పెట్టుబడులు 6 లక్షల ఉద్యోగాలు - ఏపీ సీఎం జగన్  కీలక ప్రకటన

Andhra Election Commission : తెలంగాణ ఓటర్లపై ఏపీసీఈవోకి వైసీపీ ఫిర్యాదు - అసలు ట్విస్ట్ ఇదే !

Andhra Election Commission :  తెలంగాణ ఓటర్లపై ఏపీసీఈవోకి వైసీపీ ఫిర్యాదు -  అసలు ట్విస్ట్ ఇదే  !

టాప్ స్టోరీస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!