అన్వేషించండి

AP Corona Updates: ఏపీలో కొత్తగా 1506 కరోనా కేసులు... నైట్ కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1506 మందికి వైరస్ సోకింది. కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగించింది.

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,500 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,506 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 19,93,697 మందికి వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల 16 మంది బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,647కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,835 మంది కోవిడ్ నుంచి కోలుకోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,62,185కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 17,865 క్రీయాశీల కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,56,61,449 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 

AP Corona Updates: ఏపీలో కొత్తగా 1506 కరోనా కేసులు... నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Also Read: School Colleges Reopen: రేపటి నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం... కరోనా నిబంధనలు పాటించాల్సిందే

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూను  మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ కర్ఫ్యూను ఆగస్టు 21వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా తీవ్రతపై ఏపీ సీఎం జగన్ శనివారం సమీక్షించారు. రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 

Also Read: AP CM Jagan Speech: 26 నెలల పాలన చూడండి.. మార్పు గమనించండి.. పంద్రాగస్టు వేదికపై నుంచి ఏపీ సీఎం జగన్ అభ్యర్థన

రేపట్నుంచి స్కూల్స్ 

అలాగే ఏపీలో రేపట్నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలు తెరవనున్నారు. స్థానిక పరిస్థితుల అనుగుణంగా పాఠశాలలు తెరిచేందుకు ఎస్‌వోపీ ఉండాలని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు బ్యాచ్ ల వారీగా తరగతులను నిర్వహించాలని పేర్కొం‍ది.

Also Read: Bhadradri Kothagudem: బర్రెతో మరో వ్యక్తి లైంగిక చర్య.. స్థానికుల కంటపడ్డ దృశ్యం, ఈడ్చుకొచ్చి.. చివరికి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
Tirupati Stampede: 'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
Tirupati Stampede: 'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Hyderabad News: పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Embed widget