అన్వేషించండి

CM Chandrababu: గురువారం సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు - తొలి సంతకం ఆ ఫైలుపైనే!

Andhra Pradesh News: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా డీఎస్సీ ఫైలుపై ఆయన తొలి సంతకం చేయనున్నారు.

CM Chandrababu Will Takes Charges On June 13th: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు (Chandrababu).. గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4:41 గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి వాటిపైనా ఆయన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

తిరుమలకు చంద్రబాబు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు బుధవారం సాయంత్రం కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం సాయంత్రం సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అటు, సీఎం తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు పటిష్ట ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

మంత్రులతో భేటీ
CM Chandrababu: గురువారం సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు - తొలి సంతకం ఆ ఫైలుపైనే!

అటు, ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు సీఎంకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రానికి మంత్రుల శాఖలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు తిరుమలకు కుటుంబంతో కలిసి బయలుదేరి వెళ్లారు.

Also Read: Chandrababu Naidu Oath Ceremony: ఓ ఆత్మీయత, ఓ భావోద్వేగం, అంతులేని అభిమానం - చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో గుర్తుండిపోయే క్షణం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget