అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Andhra News : ఏపీలో ప్రయోగాత్మక కులగణన - పేదవాడి జీవితానికి భద్రత వచ్చిందన్న మంత్రి !

caste census : ఏపీలో కులగణన ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ కులగణనతో పేదవాడి జీవితానికి భద్రత ఏర్పడుతుందన్నారు.

 

Andhra News :  ఆంధ్రప్రదేశ్‌లో   రెండు రోజుల ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ ప్రారంభమయింది.  బీఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న కులగణన ప్రక్రియను  మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పరిశీలించారు.  కులగణన ప్రక్రియ రాష్ట్రంలో మొదలు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ..జగన్మోహన్ రెడ్డి చిత్రపట్టానికి పాలభిషేకం చేశారు.  గ్రామ స్వరాజ్యమనే మహాత్ముల లక్ష్యాన్ని సాధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పొగిడారు . 

కులగణనతో అంబేద్కర్ ఆశయాల సాధన 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనగణన తప్ప కులగణన జరగలేదని..  మన రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కులగణనతో సాధించబోతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి చెల్లుబోయిన తెలిపారు.  ఉన్నతవర్గాలలోని పేదలతోపాటు, వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ కులగణన వెలుగులు నింపనుందని తెలిపారు.  బిసీ సంక్షేమశాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు  ఈ కులగణన జరగడం తన అదృష్టమన్నారు. తనకు ఎంతో ఇష్టమైనది బీసీలకు సేవ చేసుకోవడం.  జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ..తన అదృష్టమన్నారు. 

చంద్రబాబు 50 ఏళ్ల విజన్ చెబుతాడు - అప్పటి వరకు బతికి ఉండేదెవరు : సీఎం జగన్

కులగణనతో పేదవాడి జీవితానికి భద్రత 

సమగ్ర కులగణన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి జీవితానికి భద్రత లభిస్తుందని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.  పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న రెండు రోజుల కుల గణన పక్రియను నా నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామంలో పరిశీలించానని..  ఈ రెండు రోజుల పైలెట్ ప్రాజెక్టులో ఎలాంటి అంశాలు ఎదురవతున్నాయి..వాటిని ఎలా పరిష్కారించాలనే వాటిపై  అధ్యయనం చేస్తామని ఆయన తెిలపారు.  అధికారులకు కూడా ఏ చిన్న అంశం కూడా వదలకుండా కులగణన ప్రక్రియ జరపాలని సూచించడం జరిగిందన్నారు.  పేదవాడి సొమ్మును ఎలా దోచుకోవాలో గత ప్రభుత్వం చూస్తే...పేదవాడి సొమ్మును ఎలా పేదవారికి  చేర్చాలో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు.. అందుకు నిదర్శనమే ఈ కులగణన ప్రక్రియ అని తెలిపారు.  కులగణన ద్వారా మా వర్గాల యొక్క మనోభావాలను రక్షించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని అభినందించారు.                    

ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎక్కడ ? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని తోట చంద్రశేఖర్

త్వరలో పూర్తి స్థాయి కులగణన 

కులగణన పారదర్శకంగా జరగాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. అందుకోసం మూడు స్థాయిల్లో పునఃపరిశీలన జరిగేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరించిన వివరాలను మండలస్థాయిలో అధికారులు రీవెరిఫికేషన్ చేస్తారు. సచివాలయ పరిధిలోని 10 శాతం చొప్పున ఇళ్లల్లో ఈ రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ద్వితియస్థాయిలో రీ వెరిఫికేషన్‌ బాధ్యతలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు అప్పటించింది జగన్‌ సర్కార్‌. ఇక.. మూడో స్థాయిలో.. కింది స్థాయిలో జరిగిన సర్వేపై ఆర్‌డీవో ఆధ్వర్యంలో వెరిఫికేషన్‌ ఉంటుంది.                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget