Andhra News: విద్యార్థినికి తాళి కట్టిన టీచర్ - ఆపై అత్యాచారం, ప.గో జిల్లాలో వెలుగులోకి దారుణం
Teacher Molested Student: ఓ టీచర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి తాళి కట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప.గో జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితునిపై పోలీసులు ఫోక్సో కింద కేసు నమోదు చేశారు.
Teacher Married Student and Molested in West Godavari: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. కూతురు వయసున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి అపహరించి బాలికకు తాళి కట్టాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప.గో జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం రూరల్ (Bhimavaram) మండలం తాడేరు (Taderu) గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని యడగండి (Yadagandi) మండలంలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే స్కూల్ లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేశాడు. ఈ నెల 19న బాలికను అపహరించి తన స్వగ్రామానికి తీసుకెళ్లి, ఆమెకు తాళి కట్టాడు. అనంతరం పెళ్లి పేరుతో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధిత బాలిక, తల్లిదండ్రులతో కలిసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె.సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీచక ఉపాధ్యాయుణ్ని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు, డిమాండ్ చేశారు.
Also Read: Andhra News: ఓ చోట ముగ్గురి దారుణ హత్య - మరోచోట నవ దంపతుల ఆత్మహత్య, ఏపీలో ఒకే రోజు 2 ఘటనలు