అన్వేషించండి

Andhra News : ఏపీలో రూ. 50 వేల కోట్ల ఇసుక దోపిడీ - కీలక విషయాలు వెల్లడించిన టీడీపీ నేత ఆనంద్ బాబు

ఏపీ ఇసుక పాాలసీలో భారీ అవినతి జరుగతోందని టీడీపీ ఆరోపించింది. మైనింగ్ డైరక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోందన్నారు.

 

Andhra News  :  ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని టీడీపీ మండిపడింది. సీఎం జగన్ మద్యం, ఇసుక రెండు కళ్లుగా  భావించి దోపిడీ చేస్తున్నారని  విమర్శలు గుప్పించారు. టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన  మద్యం, ఇసుకయే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు క్యాష్ వెళ్లాలంటే  మద్యం, ఇసుక ఉండాలని..   రాష్ట్రంలో ఇసుక కుంభకోణంలో అక్షరాల 50 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు.  నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరంపాటు ఇసుక పాలసీని రాష్ట్రంలో లేకుండా నడిపారని..  ఈ ఒక్క సంవత్సరంపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అడ్డగొలుగా దోచుకున్నారన్నారు. భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి 45 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారన్నారు. 

జేపీ వెంచర్స్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీ 

సంవత్సరం తరువాత ఇసుక పాలసీ తెచ్చి జేపీ వెంచర్స్ అనే ఒక బినామీ కంపెనీని తెచ్చారు. ఆ సంస్థను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారు. వైసీపీ నాయకుల అడ్డగోలు విధానాలు, దోపిడీని భరించలేక జేపీ వెంచర్స్ మధ్యలో టర్న్ కీ అనే ఒక సంస్థను తీసుకొచ్చారని గుర్తు చేశారు.  ఆ సంస్థ కూడా ఒక యేడాదిపాటు ఒక సబ్ కాంట్రాక్టు నిర్వహించి వారు కూడా పక్కకు తప్పుకున్నారు.  ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డి, జగన్ ప్యాలెస్ సిబ్బంది  ఏజెంట్లను పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. 40 వేల కోట్లు ఇసుకలో దోచిన వైనాన్ని చంద్రబాబు గతంలోనే ఎండగట్టడం జరిగిందన్నారు.   జేపీ వెంచర్స్ కు ఇచ్చిన కాంట్రాక్టు మే నెల 12వ తేదితో ముగిసింది. ఒప్పంద పత్రాలు కూడా మేం ఆరోజు చూపాం. ఒప్పందం ముగిసి ఆరు నెలలౌతోంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలన్నీ నిలిపివేయాలని మార్చి నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇసుక అనుమతుల్ని రద్దు చేసింది. అయితే ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నారన్నరా.ు 

మైనింగ్ డైరక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దోపిడీ

స్టేట్ లెవల్ ఎన్విరాన్‌ మెంట్ ఇంపాక్టు అసెస్టెంట్ అథారిటీ వాళ్ల అనుమతులన్నీ రద్దు చేశామని చెప్పారు. ఎన్జీటీ ఆదేశాలను కూడా తుంగలో తొక్కారు. 9 సంవత్సరాల క్రితం జరిగిన ఇసుక పాలసీపై అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడిపై కేసులు పెట్టారు. 50 వేల కోట్లు అడ్డగోలుగా దోచుకున్న స్కామ్ ను మేము బయట పెడితే దానికి సమాధానం చెప్పలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబుపై కేసులు పెట్టారు. జెపీ వెంచర్స్ లేదు, టర్న్ కీ లేదు, అందరూ పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ పద్ధతి ప్రకారం చేస్తున్నారో ప్రజలకు వివరించగలరా? ప్రజల నుంచి వెంకట్ రెడ్డి తప్పించుకొని తిరగడం మంచిదికాదు. వెంకట్ రెడ్డి తన ఇంటినే ఒక ఆఫీసుగా మార్చుకొని ఇసుక ద్వారా డబ్బు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.  మేం అధికారంలోకి వచ్చాక వెంకట్ రెడ్డి ఎక్కడున్నా బయటికి లాగుతామని భయపడి ముందుగా మా నాయకుడు చంద్రబాబుపై ఫిర్యాదు ఇచ్చారన్నారు.   జిల్లా కలెక్టర్లు కూడా ఆలోచించాలని..  ఇసుక పై వే బిల్లు ఇష్యూ అయిందంటే అది కలెక్టర్ ఆఫీసు నుంచి రావాలి కావున కలెక్టర్ల భాగస్వామ్యం కూడా ఇందులో ఉందన్నారు.  ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో ఇష్యూ చేస్తున్నారు.  మైనింగ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి  అక్రమాలకు   అడ్డూ, అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. 

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వక్ర భాష్యం

సుప్రీం కోర్టు ఇచ్చిన  ఎన్ జీటీ ఆదేశాలు చిత్తూరుకు మాత్రమే అంటూ వక్రభాష్యం పలికి అడ్డగోలు  తవ్వకాలు చేపడుతున్నారని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.   ఎన్జీటీ ఆదేశాలు రాష్ట్రానికి కాదు చిత్తూరుకు మాత్రమే అంటున్నారు. 12 వందలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక 6 వేలు పెట్టి కొనాల్సివస్తోంది. గ్రావెల్, మైనింగ్, మట్టి లను నాలుగున్నరేళ్లుగా యదేచ్ఛగా దోచుకుంటు వస్తున్నారు.  హైవే పక్కనే డంప్ లు పెట్టి దోచుకుంటున్నారు. రాజమండ్రి బీచ్, తాడేపల్లి మండలం గుండెమెడ లో ప్రొక్లైనర్ తో ఇసుకను దోచుకుంటున్నారు. వీటన్ని్ంటికి మైనింగ్ ఎండి, కార్పొరేషన్ వీసీ  వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   వెంకట్ రెడ్డి ఎక్కడికి పారిపోలేవు, వీటన్నింటికి సమాధానం చెప్పాల్సి  ఉంటుందని హెచ్చరించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget