అన్వేషించండి

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Gold Missing: శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐ బ్రాంచ్ లో బంగారం మాయం కావడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా ఖాతాదారులు ఆందోళన చేస్తుండగా, తాజాగా ఓ మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Gold Missing in Srikakulam: బ్యాంకులో బంగారం మాయమైంది. ఖాతాదారులు తాము తీసుకున్న రుణం తీర్చేసినా వాళ్లకు బంగారం అందలేదు. దీంతో వారు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తుండగా, ఆరా తీసిన అధికారులు 7 కిలోల బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే గోల్డ్ కస్టోడియన్ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో సంచలనం సృష్టించింది.

రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం

శ్రీకాకుళం జిల్లా గార (Gara) ఎస్బీఐలో (SBI) బంగారం గల్లంతు వ్యవహారం కలకలం రేపింది. ఖాతాదారులు తనఖా పెట్టిన 7 కిలోల బంగారం ఆభరణాలు గల్లంతయ్యాయి. సదరు ఖాతాదారులు రుణాలు తీర్చినా వారికి బంగారం ఇవ్వలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇది ఇంటి దొంగల పనే అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణకు ముందే బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

అప్పులు తీర్చిన ఖాతాదారులు నగలు ఇవ్వకపోవడంతో నవంబర్ 27న బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం రీజనల్ మేనేజర్, ఆడిట్ కారణంగానే జాప్యం జరుగుతోందని, వదంతులు నమ్మొద్దని వారికి సద్దిచెప్పారు. డిసెంబర్ 8 వరకూ ఓపిక పట్టాలని, ఈ లోపే బంగారం అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే, బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సమయంలోనే గోల్డ్ లోన్స్ బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ (39) నవంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బంగారం పక్కదారి పట్టడంతోనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం మాయం వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

అంతర్గత విచారణలో వెల్లడి

ఈ క్రమంలో మరోసారి ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. అయితే, బ్యాంకులో నగలు మాయమైనట్లు అంతర్గత విచారణలో గుర్తించినా అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. బంగారం గల్లంతు వ్యవహారంలో స్వప్నప్రియను బాధ్యురాలిని చేస్తూ, నవంబర్ 20 నుంచి సెలవుపై పంపారు. అనంతరం రెండుసార్లు విచారణకు పిలిపించారు. డిసెంబర్ 8న ఖాతాదారులకు కచ్చితంగా బంగారం అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ లోపే మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడంతో గురువారం పోలీసులను ఆశ్రయించారు. బంగారం మాయం కావడంలో ఉద్యోగుల పాత్రపై అనుమానం ఉందంటూ ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజు, బ్రాంచి మేనేజర్ సీహెచ్.రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7 కేజీల బంగారం ఆభరణాలు (విలువ రూ.4.07 కోట్లు) మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget