అన్వేషించండి

ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్!

Anantapuram Police: అక్రమ ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీల విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Anantapuram Police: అక్రమ ఆయుధాలు తయారు చేస్తూ డీలర్ల ద్వారా అమ్మకాలు జరిపే అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ ముఠా ఆయుధాలతో పాటు డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే అనంతపురం పోలీసులు పక్కా సమాచారం, ప్లాన్ తో నిందితులను పట్టుకున్నారని వివరించారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని అభినందించి వారికి 25 వేల రూపాయల రివార్డు ప్రకటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అసాంఘీక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ఏపీ పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ వివరించారు. 

ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్... ఈ ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. బళ్లారి - అనంతపురం కేంద్రంగా  బెంగుళూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు గత కొంత కాలంగా.. నకిలీ కరెన్సీ నోట్లను, ఆయుధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని సిర్పూర్ నుండి గంజాయి, మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ కేంద్రాల నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు బర్వానీ జిల్లా ఉమర్తి గ్రామం తయారీ యూనిట్ పై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ దాడి జరిపింది.  ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను (నలుగురు తయారీ దారులు, ఒక డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు ఆయుధాల సరఫరాదారుడిని) పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం వీరి వద్ద నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరుగురు నిందితులు జంషీద్ ఖాన్, జీషన్ ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ లపై ఇప్పటికే నిందితులపైన ఏపీ, కర్ణాటక, మధ్య ప్రదేశ్, గోవాలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.

"అనంతపురంకు చెందిన పోలీసులు ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఓ పెద్ద ఆర్మ్స్ రాకెట్ ను పట్టుకున్నారు. దీంట్లో అఫెండర్స్ వచ్చేసి నలుగురు కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరు సిటిజెన్స్. వీళ్లపైన ఇంతకు ముందు కూడా ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. కొన్ని మర్డర్స్ కూడా చేసిన సందర్భాలున్నాయి. పేక్ కరెన్సీ రాకెట్ ను బస్ చేయడంతో ఆ లింక్ ద్వారా వీరిని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే  దీంట్లో నలుగురు జంషీద్ ఖాన్, జీషన్ ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 12 ఆయుధాలను సీజ్ చేసుకున్నాం. వీరిని ఇంటరాగేట్ చేయగామధ్య ప్రదేశ్ కు చెందినటువంటి మరో గ్యాంగ్ రాజ్ పాల్ సింగ్ ఎవరైతే వెపన్స్ ను ఇల్లీగల్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ల దగ్గర నుంచి కూడా కొన్ని వెపన్స్ ని సీజ్ చేసుకున్నాం. మొత్తం 18 పిస్టల్స్. వేరియస్ సైజెస్ ఉన్నాయి." - డీజీపీ రాజేంద్రనాథ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget