అన్వేషించండి

AP News: చంద్ర‌బాబుతో మాట్లాడి పేకాట క్ల‌బ్బులు తెరిపిస్తా - ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

AP News: సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడి క్ల‌బ్బుల్లో పేకాట ఆడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అనంత‌పురం టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Daggupati Prasad: అనంత‌పురంలో మాత్ర‌మే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్ల‌బ్బుల్లో పేకాట ఆడించేందుకు కృషి చేస్తాన‌ని అనంత‌పురం టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి ప్ర‌సాద్ షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో పేకాట తీసేసి నాలుగున్న‌రేళ్లు అయ్యింద‌ని, దీనిపై సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడతాన‌ని ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే తాను జిల్లా క‌లెక్ట‌ర్, పాత ఎస్పీతోనూ మాట్లాడ‌టం జ‌రిగింద‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా కృషి చేస్తాన‌ని ఆయ‌న అన్నారు.

క‌రోనా టైంలో పేకాట ఆడ‌క‌పోవ‌డం వ‌ల‌న 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు చ‌నిపోయార‌ని ఎమ్మెల్యే ప్ర‌సాద్ చెప్ప‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అనంత‌పురం ఆఫీస‌ర్స్ క్ల‌బ్బులో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇక్క‌డకి వ‌చ్చే వారంతా రిటైర్డు ఉద్యోగులు సంఘంలో గౌర‌వం ఉన్నవారేన‌ని ఆయ‌న అన్నారు. క్ల‌బ్బుకు ఎన్నిక‌లు లేకుండా ఒక మంచి వ్య‌క్తిని చూసి ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంద‌నేది త‌న అభిప్రాయ‌మ‌ని ఎమ్మెల్యే అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకోసం త‌న స‌హ‌కారం సంపూర్ణంగా ఉంటుంద‌ని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పేకాట క్ల‌బ్బుల‌ను మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక బృందాల‌తో పేకాట శిబిరాల‌పై ఉక్కుపాదం మోపారు. రీక్రియేష‌న్ క్ల‌బ్బుల పేరుతో జ‌రుగుతున్న జూదాన్ని అణ‌చివేసేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దింపారు. పేకాట‌, బెట్టింగ్‌ల కార‌ణంగా కుటుంబాలు చితికిపోతున్నాయ‌ని వాటిని అణ‌చివేసేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. 

ఆన్‌లైన్ పేకాట నిషేధిస్తూ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం

క్ల‌బ్బుల నిర్వ‌హ‌ణ ద్వారా గ‌తంలో కోట్ల‌లో బిజినెస్ న‌డిచేది. క్లబ్‌లో ప్రతి ఆటకు క‌మీష‌న్ పేరుతో ఒక్కో టేబుల్‌ నుంచి సుమారు రూ.వెయ్యి చొప్పున వ‌సూలు చేసేవారు. క‌నీసం 20కి పైగా టేబుల్స్‌తో రోజూ పేకాట శిబిరాలు న‌డిచేవి. వాటి ద్వారా నిర్వాహ‌కులు నెల‌నెలా కోట్ల వ్యాపారం చేసేవారు. ఉదయం 10 గంట‌ల‌కు మొద‌లై రాత్రి 10 గంటల వరకు నిరంత‌రాయంగా ఈ పేకాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్‌ల బారిన పడి ఎంతోమంది స‌ర్వ‌స్వం పోగొట్టుకుని త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకున్నారు.

అప్పుల‌పాలై కుటుంబాలు చిన్నాభిన్నం అయిన ఉదంతాలు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ చట్టానికి కూడా గ‌త జ‌గ‌న్ ప్రభుత్వం సవరణలు చేసింది. ఆన్‌లైన్ రమ్మీ లాంటి క్రీడలపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వాటిని ఎవరైనా ప్రోత్సహించినా, ఎక్కడైనా నిర్వహించినా, ఆడినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చ‌ట్టం చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్ గేమింగ్ చ‌ట్టానికి స‌వరణ చేసింది. ఆన్ లైన్లో రమ్మీ, పోకర్ నిర్వహించే వారికి జరిమానాతోపాటు శిక్ష విధించేలా జీవో జారీ చేయాలని నాడు కేబినెట్ తీర్మానం చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget