News
News
వీడియోలు ఆటలు
X

YSRCP News: కోటి 10 లక్షల ఇళ్లు సీఎం జగన్ వెంట ఉన్నాయి, సర్వేలో తేలింది: వైసీపీ నేతలు

ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నారని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

FOLLOW US: 
Share:

ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నారని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ ఆధ్వర్యంలో  22  రోజుల పాటు నిర్వహించిన  మెగా  పీపుల్  సర్వే వివరాలను నేతలు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా  ఎంపీ అయోధ్య  రామిరెడ్డి  మాట్లాడుతూ.. సర్వేతో ప్రజల  పరిపూర్ణ  మద్దతు  వైసీపీకి ఉన్నట్లు వెల్లడైందన్నారు. కోటి  45  లక్షల  ఇళ్లలో  కోటి  10  లక్షల  ఇళ్లు  జగన్  కు మద్దతు పలికాయని తెలిపారు.  సంస్థాగతంగా  కూడా వైసీపీ  బలంగా ఉందన్నారు. ప్రభుత్వం లో ఉన్న  ప్రతి  చిన్న   విషయం   ప్రజల్లోకి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. స్వయంగా సీఎం జగన్  పర్యవేక్షించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. భవిష్యత్ లో ప్రజలకు ఏమి కావాలి అనే విధంగా మెగా పీపుల్ సర్వే జరిగిందని రామిరెడ్డి వివరించారు.

ప్రజల మద్దతు జగన్ కే... మాజీ మంత్రి వెలంపల్లి 
వైసిపి  పీపుల్   సర్వే  కి  కోటి  10  లక్షల  మిస్డ్ కాల్స్  వచ్చాయని,  ఒక  ఫోన్  నుంచి  ఒక  కాల్  మాత్రమే  వచ్చిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల  మద్దతు  తెలిపిన  పుస్తకాలు  కూడా దీనికి ప్రత్యక్ష  నిదర్శనం గా ఉన్నాయన్నారు. గతంలో ఏ పార్టీ చేయని విధంగా ఇటువంటి సర్వే నిర్వహణ జగన్ వల్లే సాధ్యమైందన్నారు. కుల   మతాలకు  అతీతంగా   పాలన చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. సర్వేలో పాల్గొన్న కార్యకర్తలు  నేతలకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

డీబీటీపై ఆనందంగా ఉంది... మల్లాది విష్ణు 
ప్రజల  మద్దతు  80  శాతం  సీఎం  జగన్  కు  ఉందని ప్లానింగ్ కమిషన్ వైస్  చైర్మన్ మల్లాది  విష్ణు  తెలిపారు. పీపుల్  సర్వే లో  80  శాతం ప్రజలు  ఈ  ప్రభుత్వానికి  మద్దతు ఇచ్చారన్నారు. ముందుగా కాకినాడ  ఎన్టీఆర్ బాపట్ల..అనంతపురం  జిల్లాల్లో పీపుల్ సర్వే కార్యక్రమం బాగా జరిగిందన్నారు. డైరెక్ట్  బెనిఫిట్  ట్రాన్స్ఫర్  ఫలితాలు  బాగా  అందుతున్నాయని  ప్రజలు  చెబుతున్నారని తెలిపారు. జగన్  కు  డిబిటి  విషయం లో  ప్రజలు  పూర్తి మద్దతు  తెలిపారని, ప్రతి  నెల 1న ఇచ్చే   పెన్షన్లు విషయంలో కూడా  ప్రభుత్వం పై  సంతృప్తి  తో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఏ సీఎం చేయని విధంగా... అవినాష్ 
ఇప్పటివరకు  ఏ  ముఖ్యమంత్రికి  రాని  ఆలోచన  మెగా  పీపుల్  సర్వే తో సీఎం జగన్ ప్రజల దగ్గరకు వెళ్లి  ప్రభుత్వం  ఏమి  చేసిందో  ప్రజలకు  వివరించామని వైసీపీ తూర్పు ఇన్ చార్జి దేవినేని అవినాష్ తెలిపారు. గతంలో  టీడీపీ కి మద్దతు  ఉంటేనే   సంక్షేమ  కార్యక్రమాలు  అమలు జరిగేవని, ప్రతి  పార్టీ  ఇంటికి వెళ్లామని, అందరూ  కూడా  జగన్ కు మద్దతు  పలికారన్నారు.  రోజు  ప్రజల దగ్గరకు  వెళ్లాలనే  ఆలోచన  చంద్రబాబు  కు  రాలేదన్నారు.  ప్రభుత్వం చేసిన పనులు నిజాయితీ గా ప్రజలకు వివరించామని అవినాష్ వివరించారు.  

ధైర్యంగా వెళ్లాం... రాజశేఖర్ 
వైసీపీ ఏడు  లక్షల  మంది  పార్టీ  కార్యకర్తల తో  మెగా  పిఫుల్ సర్వే  నిర్వహించినట్లు ఎమ్మెల్సీ మర్రి  రాజశేఖర్ తెలిపారు.  కోటి  45  లక్షల కుటుంబాలను కలిశామని, కోటి  10  లక్షల  మిసిడ్  కాల్స్  కూడా   ప్రజలు  ఇచ్చారన్నారు.  ప్రజల  దగ్గరికి ధైర్యంగా  వెళ్లడమే   ప్రధాన  ఎజెండా కార్యక్రమం జరిగిందని, ప్రజా  స్పందన  అమోఘం గా ఉందన్నారు. 80  శాతం  మంది  జగన్ పై విశ్వాసం  వ్యక్తం చేశారని, ప్రజా  మద్దతు  పేరుతో  పుస్తకాలు  ఇచ్చి  సర్వే  చేశామని చెప్పారు. గత నాలుగేళ్లలో  ప్రభుత్వం చేసిన  అభివృద్ధి  కార్యక్రమాలు వివరించామని ఆయన పేర్కొన్నారు.

Published at : 29 Apr 2023 04:00 PM (IST) Tags: YS Jagan YSRCP AP News AP Latest news Malladi Vishnu

సంబంధిత కథనాలు

AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP Employees: ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల భేటీ, అసహనంతోనే బయటికి!

AP Employees: ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల భేటీ, అసహనంతోనే బయటికి!

Sujana On Janasena : టీడీపీ కోవర్టును కాదు - బీజేపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందన్న సుజనా చౌదరి

Sujana On Janasena : టీడీపీ కోవర్టును కాదు - బీజేపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందన్న సుజనా చౌదరి

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !