By: ABP Desam | Updated at : 07 Jun 2023 04:00 PM (IST)
లక్ష్మీ పార్వతి (ఫైల్ ఫోటో)
వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ప్రవాసీలుగా మిగిలిపోతారని తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఇప్పటికే వాళ్ళు తెలంగాణకు నుంచి వచ్చి వెళుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు సమాధి కట్టేయడం ఖాయం అని వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ చదువు సంధ్యలు లేని మూర్ఖుడంటూ వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కారం లోకేష్ కు ఉందని అన్నారు. ఈవెనింగ్ వాక్ చేస్తే అది పాదయాత్ర అవుతుందా అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడుపై.. తాను పుస్తకం రాశానని.. ‘దానికి అల్లుడు సుద్దులు’ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆమె ప్రకటించారు. టీడీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. మహిళలు, రైతులను మోసం చేయడమే చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు గతంలో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు హామీల అమలుకు ఆర్బీఐ సొమ్ము కూడా చాలదని లక్ష్మీపార్వతి అన్నారు.
చంద్రబాబు - అమిత్ షా భేటీ వెనుక ఆయనే
కేసుల మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు తొలి ప్రయత్నం విఫలమైందని అన్నారు. పొత్తుల కోసం బీజేపీ పెద్దలను ఆశ్రయించాలనే చంద్రబాబు ఆలోచనలకు బ్రేకులు పడ్డాయని, కాలం మళ్లీ వెనక్కి తిరిగిందని అన్నారు. చంద్రబాబును బీజేపీ నమ్మదని.. వెంకయ్య నాయుడు చెప్పారనే చంద్రబాబుతో మీటింగ్‌కు అమిత్ షా ఒప్పుకున్నారని తెలిపారు. మరోసారి షా, బాబు భేటీ జరిగితే అప్పుడు ఏదో జరుగుతుందని భావించొచ్చని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అక్రమ నిర్మాణంలో ఉండడం సిగ్గులేనితనం అంటూ లక్ష్మీపార్వతి అన్నారు.
కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును ముంచేసిన ఘనుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి కోసం పోలవరంలో ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎటువంటి ఉపాయాలైనా వేస్తారన్నారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప శాశ్వత శత్రుత్వాలు పార్టీల మధ్య ఉండవని అన్నారు.
చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వారాహి రోడ్డెక్కుతోందని విమర్శించారు. టీడీపీతో కలయిక రాజకీయ నాయడుగా పవన్ కళ్యాణ్ కు తీవ్ర నష్టం కలిగిందని విశ్లేషించారు. ఓట్లు చీల్చడం అంత ఈజీ కాదన్న లక్ష్మీ పార్వతి..నాయకుడి విధానాలు అర్ధం కాక జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు.
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు
సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు
Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు
Etela Rajender: గ్రూప్ 1 పరీక్ష రద్దు- తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్
Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి, గన్ మిస్ ఫైర్
/body>