అన్వేషించండి

YS Jagan Guntur Tour: భారీ భద్రతతో గుంటూరు చేరుకున్న మాజీ సీఎం జగన్.. కాసేపట్లో అంబటి నివాసానికి !

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ భద్రత నడుమ గుంటూరు నగరానికి చేరుకున్నారు. 9 వాహనాల కాన్వాయ్ తో జగన్ గుంటూరు పర్యటనకు వెళ్లారు.

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు గుంటూరులో పర్యటిస్తున్నారు. ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు జగన్. మాజీ మంత్రి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పనున్నారు. కేసులను చట్టప్రకారం కోర్టుల్లో ఎదుర్కొంటామని వారికి మద్దతు తెలపనున్నారు.

మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత నడుమ, భారీ కాన్వాయ్‌తో తాడేపల్లి నుంచి గుంటూరుకు చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ తో పాటు మరో 9 వాహనాలు వెళ్లాయి. ఈ పర్యటన సందర్భంగా గుంటూరు నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


YS Jagan Guntur Tour: భారీ భద్రతతో గుంటూరు చేరుకున్న మాజీ సీఎం జగన్.. కాసేపట్లో అంబటి నివాసానికి !

గత శనివారం అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇది ఏపీలో అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఆయన కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి జగన్ వెళ్లారు. పరామర్శ అనంతరం, అంబటి ఇంటి సమీపంలో ధ్వంసమైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించి, పార్టీ నేతలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.


YS Jagan Guntur Tour: భారీ భద్రతతో గుంటూరు చేరుకున్న మాజీ సీఎం జగన్.. కాసేపట్లో అంబటి నివాసానికి !

మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. తాడేపల్లి నుంచి మంగళగిరి, కాకాని మీదుగా సాగిన ఆయన పర్యటన ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనకు 2 వారాల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి కుటుంబానికి మద్దతు తెలిపి, వారికి అండగా నిలిచేందుకు జగన్ గుంటూరుకు వచ్చారు. 


YS Jagan Guntur Tour: భారీ భద్రతతో గుంటూరు చేరుకున్న మాజీ సీఎం జగన్.. కాసేపట్లో అంబటి నివాసానికి !

అంబటి నివాసంపై దాడి.. టీడీపీ నేతలపై కేసులు నమోదు

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో గుంటూరు పట్టాభిపురం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ఏ1గా, ఆమె భర్త రామచంద్రరావును ఏ2గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మొత్తం 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై అల్లర్లు సృష్టించడం మరియు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ పాప ప్రక్షాళన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేసింది. ఈ క్రమంలో గుంటూరులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. 24 గంటల్లోగా చంద్రబాబుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రులతో పాటు టీడీపీ నేతలు అంబటిని హెచ్చరించినా పట్టించుకోలేదు. తాను అలాంటి మాటలు అనకుండా ఉండాల్సింది అన్నారు, కానీ చంద్రబాబుకు క్షమాపణ చెప్పకపోవడంతో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు అంబటి నివాసానికి వెళ్లి హంగామా చేశారు. ఇంటిపై దాడికి యత్నించారు, ఓ చోట నిప్పు సైతం పెట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget