YSRCP News: జైలుకు వెళ్లొచ్చిన తర్వాతే జగన్ సీఎం అయ్యారు- వైసీపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
YSRCP MP Nandigam Suresh: నోరు తెరిస్తే వైఎస్ జగన్ జైలుకు కెళ్లారని విమర్శిస్తున్నారని, జైలుకు వెళ్లొచ్చిన తర్వాతే ఆయన ఏపీకి సీఎం అయ్యారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.
YSRCP MP Nandigam Suresh: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చిన తర్వాతే ఏపీకి సీఎం అయ్యారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నోరు తెరిస్తే వైఎస్ జగన్ జైలుకు కెళ్లారని విమర్శిస్తున్నారని, ప్రజలు కోరుకున్నారు కాబట్టే ఆయనను సీఎం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిన్నది అరగక చేసేదే అమరావతి ఉద్యమం అని, బలవంతంగా భూములు లాక్కుని రాజధాని ఏర్పాటు చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కోసమే నక్కా ఆనంద్ బాబు మాట్లాడాడరని, కావాలంటే తాము సైతం చంద్రబాబుపై వ్యక్తిగతంగా అలా మాట్లాడగలం అన్నారు. కానీ కొంచెం విజ్ఞత ఉంది, కనుక మేం పద్ధతిగా వెళ్తున్నామని చెప్పారు. అమరావతి పెయిడ్ టెంట్ వద్దకు వెళ్లి నక్కా ఆనంద్ బాబు నోటికొచ్చి మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు.
దుర్మార్గమైన ఆలోచనతోనే చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేశారని, ప్రజలంతా వ్యతిరేకించారు కనుక టీడీపీ హయాంలో తాత్కాలిక సచివాలయం కట్టారని సెటైర్లు వేశారు. రాజధానికి అమరావతి అనుకూలం కాదని చంద్రబాబుకు ముందుగానే తెలుసునన్నారు. చంద్రబాబు ఓ గుంట నక్క అంటూ మాజీ సీఎంపై ఎంపీ నందిగం సురేష్ విరుచుకుపడ్డారు. మీరు మొదట చెప్పిన అమరావతికి, రాజధాని పెట్టిన అమరావతికి అసలు సంబంధమే లేదన్నారు. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆఫీసులు తప్ప మరొకటి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.
రాజధాని పేరుతో పచ్చని పొలాలను చంద్రబాబు నాశనం చేశారని, భూదాహం ఉన్న వారంతా కలిసి ఏర్పాటు చేసుకున్నదే రాజధాని అన్నారు. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి ఉద్యమం పెట్టారని, కానీ ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. నక్కా ఆనంద్ బాబు చంద్రబాబుకు బానిసత్వం మానుకోవాలని, చచ్చినోడిదగ్గర ఏడుస్తున్నట్లు ఏడుస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్రతి వెధవా సీఎం జగన్ పై విమర్శలు చేసే వారయ్యారు అని టీడీపీ నేతలపై మండిపడ్డారు. లోకేష్ యువగళంతో పాటు పవన్ వారాహి యాత్రలపై సైతం వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్నారు.
చంద్రబాబును చూస్తే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుందన్నారు. తన ప్రభుత్వంలో ఫలానా పథకం పెట్టానని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. లోకేష్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. చేతనైతే ముందు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు. వీరికి పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ అంటూ జనసేనానిపై సైతం విమర్శలు చేశారు. లోకేష్ యువగళం ఫెయిల్ కావడంతో పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారని పేర్కొన్నారు. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయాల్లోంచి తప్పుకోవడం ఖాయం అన్నారు ఎంపీ నందిగం సురేష్.
Also Read: విశాఖలో ఇక ఏమీ మిగల్లేదని బీచ్‌లో ఎంట్రీ ఫీజు వేస్తారా ? - ప్రభుత్వంపై గంటా ఫైర్ !
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial