Parliament Monsoon Session: పార్లమెంట్‌లో వాటర్ వార్... తెలంగాణపై ఏపీ ఎంపీ ఫైర్
తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వాటర్ వార్ ఢిల్లీ చేరింది. తెలంగాణ చర్యలపై లోక్ సభలో ప్రస్తావించారు వైసీపీ ఎంపీలు.
తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదం పార్లమెంట్‌లో మారుమోగింది. కేంద్రానికి ఇప్పటికే తెలంగాణ వైఖరిపై లేఖలు రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..మరో అడుగు ముందుకేసింది. తమ పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌లో ఆందోళన చేయించింది. క్వశ్చన్ అవర్‌లో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి... జల వివాదంపై ప్రశ్నలు సంధించారు. గెజిట్ నోటిఫికేషన్, తెలంగాణ విద్యుదుత్పత్తి అంశాలు ప్రస్తావించారు.
ALSO READ:కాపు నేస్తం నిధులు విడుదల.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వెనక్కి తగ్గట్లే
తెలంగాణ జల విద్యుదుత్పత్తి అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారని... అయినా తెలంగాణ మాట పట్టించుకోలేదని... ఉత్పత్తి మాత్రం ఆపలేదని... లోక్ సభలో లేవనెత్తారు. తెలంగాణ చర్యలతో రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చర్యలను కేంద్రం, కృష్ణా బోర్డు అడ్డుకోవాలి విజ్ఞప్తి చేశారు అవినాష్. ఈ చర్యలు ఇలానే కొనసాగితే.. ఏపీతోపాటు చెన్నైకి నీటి సమస్య ఎదురయ్యే ఛాన్స్ ఉందన్నారు.
ALSO READ:కన్ఫార్మ్.. కౌశిక్ రెడ్డికి టిక్కెట్ లేదు..! ఇదే సాక్ష్యం...
ఈ ప్రశ్నోత్తరాల టైంలోనే అక్రమ ప్రాజెక్టుల అంశాన్ని కూడా ప్రస్తావించారు పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డి. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ALSO READ:కెప్టెన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన సిద్ధూ..!
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన క్వశ్చన్స్‌కు కేంద్ర జల్‌శక్తి మినిస్టర్ గజేంద్రసింగ్ షెకావత్ ఆన్సర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. వాటర్ వార్‌పై ఏపీ రాసిన లేఖలు తమకు, కేఆర్‌ఎంబీకి చేరినట్టు సభలో తెలిపారు మంత్రి. ఈ లేఖలకు స్పందించిన తర్వాత పవర్ ప్రొడెక్షన్ ఆపాలని తెలంగాణ సూచించినట్టు మంత్రి వివరించారు.
ALSO READ:''ప్రియమణి వివాహం.. చెల్లదా..?''
కేంద్రం చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తమ చర్యలు కొనసాగించిందన్నారు కేంద్ర జల్‌శక్తి మంత్రి. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణకు మరోసారి సూచిస్తామని సభా ముఖంగా మంత్రి తెలిపారు.
ALSO READ:గుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు మాత్రమే ఎందుకు తీసుకెళతారు?
పోలవరం అంశంపై చర్చ చేపట్టాలని కూడా వైకాపా ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్ అనుమతి ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు పోలవరం నిధులపై వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్లానింగ్ కమిషన్ మంత్రి ఇంద్రజిత్‌సింగ్ జవాబు ఇచ్చారు. 8ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 నుంచి ఇప్పటివరకు 11వందల82 కోట్లు ఇచ్చామని ప్రకటించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.
ALSO READ: ఎండ, వాన లెక్కేలేదు.. రద్దు చేసేవరకు తగ్గేదే లేదు!