Corona Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పదివేలకుపైగా కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కేసులు తగ్గకపోయినా కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరట ఇచ్చే అంశంగా చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కూడా పది వేలకుపైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 13, 618కేసలు వెలుగులోకి వచ్చాయి. 46,143 పరీక్షలు చేయగా ఈ కేసులు బహిర్గతమయ్యాయి.
#COVIDUpdates: 26/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 26, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,19,678 పాజిటివ్ కేసు లకు గాను
*20,98,790 మంది డిశ్చార్జ్ కాగా
*14,570 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,06,318#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oV6ha2qL9a
రాష్ట్రంలో ప్రస్తుతం లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తన బులెటిన్‌లో ప్రకటించింది. లక్షా ఆరువేల మూడు వందల పద్దెనిమిది కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు పేర్కొంది. పదిహేడు వందల తొంభై ఒక్క కేసుతో విశాఖ టాప్‌లో ఉంటే... తర్వాత స్థానాల్లో అనంతపురం(1650), గుంటూరు(1464), కర్నూలు(1409), ప్రకాశం(1295), నెల్లూరు(1409) జిల్లాలు ఉన్నాయి.
కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది వైరస్ బారి నుంచి క్షేమంగా బయటపడ్డారు.
కోరనా మహమ్మారి బారిన పడి తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాలో ఇద్దరేసి చనిపోయారు. చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. టోటల్‌గా ఇప్పటి వరకు కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో పద్నాలుగు వేల ఐదు వందల డెభ్బై మంది మృతి చెందారు.