అన్వేషించండి

పాదయాత్ర పునః ప్రారంభానికే అమరావతి రైతుల మొగ్గు- త్వరలో తేదీ ప్రకటన

అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది.

అమరావతి పాదయాత్రపై విధించిన ఆంక్షలు తొలగించాలన్న పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో యాత్రను పునఃప్రారంభించేందుకు అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఓ తేదీని ప్రకటించబోతున్నట్టు అమరావతి ఐకాస ప్రకటించింది. 

పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి అమరావతి రైతులు పాదయాత్ర రీస్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆంక్షలను ఎత్తే పరిస్థితి లేదన్న కోర్టు తీర్పుతో యాత్ర పునఃప్రారంభించాలన్న నిర్ణయానికి రైతులు వచ్చారు. మూడు నాలుగు రోజుల్లో ఓ తేదీని ప్రకటించబోతున్నట్టు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రకటించింది.  

అమరావతి పాదయాత్రపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమరావతి రైతులు, పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ఏపీ డీజీపీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతులకు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఆంక్షల ఉల్లంఘించవద్దని రైతులకు స్పష్టం చేసింది. రైతులు షరతులు ఉల్లంఘిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి సూచించింది. 

ఆరు వందల మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆంక్షలు
అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. అమరావతి రైతులు పాదయాత్ర చేసుకునే తప్పుడు వేరే ఎవరు వీళ్ళకి అడ్డంకులు కలిగించకుండా పోలీసులు తగు జాగ్రత్తులు తీసుకోవాలని ఆదేశించింది. పది రోజుల కిందట.. అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చే వాళ్లంతా రోడ్డుకు రెండు వైపులా నిలబడి మద్దతు తెలపాలని సూచించింది. పాదయాత్రలో కలిసి నడవకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలని ఆదేశించింది.  

ఆరు వందల మందికి ఐడీ కార్డులివ్వాలని హైకోర్టు ఆదేశాలు
ఆరు వందల మందికి పోలీసులు ఐడీ కార్డులు ఇవ్వలేదని నూట యభై మందికి మాత్రమే ఇచ్చారని... రైతులు హైకోర్టుకు తెలిపారు. పాదయాత్రలో ఐడీ కార్డులు ఉన్న వారే పాల్గొనాలనడం సరి కాదని.. కొంత మంది యాత్ర మధ్యలో వెళ్తూంటే.. మరికొంత మంది కలుస్తుంటారని వాదించారు.  పాదయాత్రలు చేస్తున్న ఎవరికీ లేని ఆంక్షలు తమకు ఎందుకని కోర్టును ఆశ్రయించారు. అయితే వారికి ఊరట లభించలేదు. ఆరు వందల మందితోనే పాదాయత్ర చేయాలని నిర్ణయంచారు. 

పది రోజుల కిందట అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఐడీ కార్డులు చూపించాలని రైతులపై పోలీసులు నిలదీశారు. అనుమతి ఉన్నవారిని కాకుండా మిగిలిన వారి వాహనాలను అనుమతించమని పోలీసులు స్పష్టం దీంతో అక్కడ రైతులు.పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం అయింది. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రకు బ్రేక్‌ ఇస్తున్నట్టు తెలిపారు. పోలీసుల తీరుపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారికి ఊరట లభించలేదు.

అందుకే కోర్టు చెప్పిన ప్రకారం పాదయాత్ర కొనసాగిస్తామని ప్రకటించింది అమరావతి పరిరక్షణ సమితి. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వానికి బుద్దిరావాలని విజ్ఞప్తి చేశారు రైతులు. దివ్యరథానికి ఉన్న సీసీ కెమెరాను తీసుకెళ్లి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఆ అవసరమేంటని నిలదీశారు. కోర్టు తీర్పునకు విరుద్దంగా చేసిన ఈ పనికి ప్రైవేటు కేసు వేయబోతున్నట్టు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget