Nijam Gelichindi Prajaswamyam Nilichinidi: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది- టీడీపీ భావోద్వేగ నినాదం వైరల్- ప్రజలకు భువనేశ్వరి ప్రణామం
Chandra Babu: నిజం గెలవాలి అనే పదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవం సృష్టించింది. అంకుశంలా మారి వైసీపీ ప్రభుత్వాన్ని చీల్చేసింది. అందుకే మరోసారి ఇవాళ్టి సభలో నేతలంతా అదే నినాదాన్ని అందుకున్నారు.
Andhra Pradesh Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు. దీంతో టీడీపీ ేతలు నిజం గెలిచింది... ప్రజాస్వామ్యం నిలిచిందని నినాదాలు అందుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును అప్పటి అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా దూషించిది. అనేకరకాలుగా అవమానలు పాల్జేసింది. కేసులు పెట్టి జైల్లో కూడా వేసింది.
అందుకే వాటిని గుర్తు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలించిందని ఎలుగెత్తుతున్నారు. టీడీపీ సభ్యులంతా సభలోకి ఈ నినాదంతో ప్లకార్డులు పట్టుకొని వచ్చి నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలిచిందని నినాదాలతోపాటు గౌరవ సభకు స్వాగతమంటూ చంద్రబాబును చిరునవ్వులతో ఆహ్వానించారు.
నారా భువనేశ్వరి కూడా తన ట్విట్టర్‌లో నిజం గెలిచిందనే నినాతో పోస్టు పెట్టారు. కౌరవ సభ నుంచి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు నేడు గౌరవ సభకు వచ్చారని భువనేశ్వరి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు!
— Nara Bhuvaneswari (@ManagingTrustee) June 21, 2024
నిజం గెలిచింది….ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!#TeluguAtmaGauravamWins pic.twitter.com/mnyuQu5Pt6
2021 నవంబరు 19న తన నిండు సభలో చంద్రబాబును వైసీపీ సభ్యులు ఘోరంగా అవమానించారు. అప్పటి వరకు అన్నింటినీ తట్టుకున్న చంద్రబాబు తన ఫ్యామిలీపై నిందలు వేయడంతో సభకు నమస్కారం పెట్టి ఇది గౌరవ సభ కాదని కౌరవ సభమాదిరి తయారైందని ఆవేనద వ్యక్తం చేశారు. ఇకపై తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతాని శపథం చేసి సభ నుంచి వచ్చేశారు. మీడియా సమావేశం పెట్టి తనకు ఇంతంటి అవమానం జరిగిందని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తర్వాత కొన్ని రోజులకు చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి జైల్లో వేశారు. అప్పటి వరకు రాజకీయ వేదికలపై కనిపించని భువనేశ్వరి తొలిసారిగా నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక చనిపోయిన వారి ఫ్యామిలీలను పరామర్శించారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజల కోసమే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తారని చెప్పుకుంటూ వచ్చారు.
కచ్చితంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు మేలు చేస్తారని భువనేశ్వరి నమ్మారు. ఆదే విషయాన్ని పరామర్శలో ప్రజలకు చెప్పారు. అన్నట్టుగానే చంద్రబాబు అఖండమైన మెజార్టీతో విజయం సాధించారు. తనను ఘోరంగా అవమానించిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
అప్పట్లో చంద్రబాబును సూటిపోటి మాటలతో అవమానించిన నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. బూతులు తిట్టే నేతలు ఇంటిబాటపట్టారు. వారందర్నీ ప్రజలు ఓటుతో ఓడించారు. వాటన్నింటినీ గుర్తు చేసుకున్న టీడీపీ సభ్యులు, భువనేశ్వరి నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలిచిందని గట్టిగా భావోద్వేగంతో నినదిస్తున్నారు.