అన్వేషించండి

AP Assembly News: ఏపీ అసెంబ్లీలో రచ్చరచ్చ! పేపర్లు చింపి స్పీకర్‌పై వేసిన లీడర్లు - 13 మంది సస్పెన్షన్

టీడీపీ సభ్యులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు.

ఏపీ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. నేడు (సెప్టెంబరు 21) దానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నందున.. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభం కాగానే, టీడీపీ సభ్యులు నిరసన మొదలుపెట్టారు. తొలుత స్పీకర్‌ తమ్మినేని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దాన్ని అడ్డుకున్న టీడీపీ సభ్యులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. పోడియం వద్దకు కూడా వచ్చి నినాదాలు చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును వైసీపీ మంత్రులు, నేతలు తప్పుబట్టారు. అయినా వారు పట్టు విడవకుండా నిరసన మరింత ఎక్కువ చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

స్పీకర్‌పై పేపర్లు చింపి వేసిన టీడీపీ సభ్యులు, అంతా సస్పెన్షన్
ఏపీ శాసనసభ మళ్లీ 11 గంటలు దాటాక తిరిగి ప్రారంభం అయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యులు మళ్లీ నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లు ప్రతులను చింపి స్పీకర్ మీద వేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పీకర్ 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లకుండా తమ నిరసన కొనసాగించడంతో మార్షల్స్ సాయంతో వారిని బలవంతంగా బయటికి పంపించారు.


AP Assembly News: ఏపీ అసెంబ్లీలో రచ్చరచ్చ! పేపర్లు చింపి స్పీకర్‌పై వేసిన లీడర్లు - 13 మంది సస్పెన్షన్

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలు అసెంబ్లీ బయట ఆందోళన చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్న రాజ‌ప్ప మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ తుగ్లక్ చ‌ర్యలు తీసుకుంటున్నారని, వాటిని అడ్డుకొని తీరతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు చేయ‌డం జ‌గ‌న్ నిరంకుశత్వానికి ప‌రాకాష్ట అని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల‌ రామ‌చంద్రరావు మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ కొత్త సాంప్రదాయాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారని, ఎన్టీఆర్ జోలికి వ‌స్తే జ‌గ‌న్ ఇంటికే ప‌రిమితమ‌వుతారని హెచ్చరించారు. 

ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు తొలగించి త‌న ప‌త‌నాన్ని తానే ప్రారంభించుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ సేవలు ప్రజ‌ల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాయని, ఎంత‌మంది ముఖ్యమంత్రులు మారినా పేరు మార్పు అనేది జ‌ర‌గ‌లేదని అన్నారు. అంగ‌ర రామ్మోహ‌న్ రావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వ‌స్తే క‌డ‌ప జిల్లాకు వైఎస్ పేరును తొల‌గించే ఆలోచ‌న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లిపిస్తున్నారని అన్నారు. హెల్త్‌ యూనిర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గింపుపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రం పేరునే మార్చేస్తారు - పయ్యావుల

వర్సిటీల పేర్లనే కాకుండా జగన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మారుస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే రాష్ట్రం పేరును జగనాంధ్రప్రదేశ్ అని మార్చేలా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు పయ్యావుల. విశ్వవిశ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం ఎన్టీఆర్ పేరు తొలగించాలని మీకు ఎలా అనిపిస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా? అన్ని పథకాలకు, వర్సిటీలతో పాటు రాష్ట్రం పేరు కూడా జగనాంధ్రప్రదేశ్ అని మారుస్తారంటూ వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget