మీవి రోడ్లు వేసే మొహాలేనా- ఏదైనా కట్టి చూపించండి- ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు.
ఇప్పటంలో పవన్ పర్యటనకు ఆటంకం కలిగిన ప్రభుత్వం, అధికారులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసలు కట్టడంలో ఉన్న సంతృప్తి మీకు తెలుసా అంటూ... రోడ్లు వేసే మొహాలేనా ఆంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయని... ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేని శాపనార్థాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీ దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా? అంటూ ఎద్దేవా చేశారు.
ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుంది. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి...ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారు.(1/3) pic.twitter.com/vnUwA8b7pN
— N Chandrababu Naidu (@ncbn) November 5, 2022
ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను అడ్డుకుంటేనో... చీకట్లో చమ పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరని హెచ్చరించారు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి అంటూ సవాల్ చేశారు. ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుందన్నారు.
కుప్పంలో మునిసిపల్ అధికారులు జయమ్మ అనే ఓ దళిత మహిళ షాపుపై దౌర్జన్యం చేయడాన్ని కూడా చంద్రబాబు ఖండించారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వ హయాంలో సాయం పొందిన జయమ్మ టెంట్ హౌస్ నిర్వహిస్తూ, మున్సిపల్ కాంప్లెక్స్‌లో రెండు షాపులకు అద్దె కడుతున్నారు. ఖాళీగా ఉన్న మరో షాపు వద్ద మెటీరియల్ పెట్టుకున్నారు. దాన్ని నేరగా అధికారులు భావించడమేంటని ప్రశ్నించారు. ఆమె సామగ్రి బయట పడేయడం తప్పని అన్నారు. చిన్న వ్యాపారం పెట్టుకుని బతుకుతున్న ఒక దళిత మహిళ పైన కక్ష చూపడం ఈ ప్రభుత్వ దురహంకార వైఖరికి నిదర్శనమన్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఖాళీ చేయించడం నీచమైన చర్యగా అభివర్ణించారు.
కుప్పంలో మునిసిపల్ అధికారులు జయమ్మ అనే ఓ దళిత మహిళ షాపుపై దౌర్జన్యం చేయడం దారుణం. ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వ హయాంలో సాయం పొందిన జయమ్మ టెంట్ హౌస్ నిర్వహిస్తూ, మున్సిపల్ కాంప్లెక్స్ లో రెండు షాపులకు అద్దె కడుతున్నారు. ఖాళీగా ఉన్న మరో షాపు వద్ద మెటీరియల్ పెట్టుకున్నారు(1/2) pic.twitter.com/fPXRGPhl2P
— N Chandrababu Naidu (@ncbn) November 4, 2022