By: ABP Desam | Updated at : 15 May 2023 07:04 PM (IST)
సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)
వైసీపీ ప్రభుత్వం, అవినీతి, అక్రమాలపై అభియోగాల సేకరణ ప్రజా చార్ట్ షీట్ కార్యక్రమం పల్నాడు జిల్లా, గురజాల పట్టణంలో జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను గురజాల ఆర్డీవోకు సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు.
పొత్తుల నిర్ణయం అధిష్ఠానం చూసుకుంటుంది - సోము
వైసీపీ ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు, రానున్న ఎన్నికలలో పొత్తుల విషయమై బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కట్టుబడి ఉంటుందని అన్నారు.
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళించింది
సాగరమాల పథకం కింద జాతీయ రహదారులు పల్నాడు ప్రాంతంలో కూడా కేంద్రం నిర్మించింది. పల్నాడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు అందించి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు నిర్మించాలని కేంద్రం భావిస్తే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించే విధంగా స్థానిక నాయకత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో అనేక మంది భూములు కబ్జాకి గురి అయినట్లు తన దృష్టికి వచ్చాయని అన్నారు.
దీనిపై ఆర్డిఓకి సమస్యలను నివేదిస్తూ ఈరోజే అర్జీలు దాఖలు చేశామని.. అధికారులు సానుకూలంగా వ్యవహరించి భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ భూకబ్జాలు సహజ వనరుల దోపిడీ అరాచకంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వ తీరు మారాలి
ప్రభుత్వం, స్థానిక నాయకుల తీరుపై ప్రజల నుండి అనేక అభియోగాలు వచ్చాయన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు ఆర్భాటాలకు ఖర్చు చేసి అధికారం దిశగా చేస్తున్న ఈ దుర్మార్గ పాలనను ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దళిత కుటుంబాలకు సంబంధించిన మూడు ఎకరాల భూమి ఏళ్ల తరబడి సాగులో ఉన్నప్పటికీ తాజాగా వైసీపీ పాలనలో సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయి కబ్జాలకు గురయ్యే దిశగా పాలన సాగుతుందని తెలిపారు.
గ్రామ సుపరిపాలన గాడి తప్పింది
‘‘గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు కరెంటు బిల్లుల పేరుతో గ్రామపంచాయతీ నిధులను కూడా కాజేశారు. గ్రామపంచాయతీ సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి గ్రామాలు అభివృద్ధి చెందకుండా గ్రామ సర్పంచులకు ఆర్థిక స్వావలంబన లేకుండా, గ్రామాల అభివృద్ధి కుంటుపడే విధంగా కుటిల సాకులతో దుర్మార్గాలకు పాల్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని మంత్రిత్వ శాఖల నుండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చురుకుగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది’’ అని అన్నారు.
అభివృద్ధికి సహకరించని రాష్ట్ర ప్రభుత్వం
ప్రతి జిల్లాలో 1200 కోట్లకు పైబడి నిధులు ఉపయోగించి జల్ జీవన్ మిషన్ పనులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లకు గుర్తింపు లేకుండా పోయింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన చార్జిషీట్లు కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన గన్నవరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సోము వీర్రాజు తెలిపారు.
Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!
గుంటూరులో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్
Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
Telangana Decade Celebrations: 9 ఏళ్లు గడుస్తున్న తీరని విభజన సమస్యలు.. ఎవరు అడ్డుపడుతున్నారు..?
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత