Jupudi Prabhakar: జూపూడి ప్రభాకర్ వింత వ్యవహారం! అంబేడ్కర్‌పై వివాదాస్పదంగా కామెంట్స్!
Ambedkar Videshi Vidya: అంబేడ్కర్ విదేశీ విద్య పేరును జగన్ విదేశీ విద్యగా మార్పు చేసిన విషయంపై జూపూడి ప్రభాకర్ మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడారు.
![Jupudi Prabhakar: జూపూడి ప్రభాకర్ వింత వ్యవహారం! అంబేడ్కర్‌పై వివాదాస్పదంగా కామెంట్స్! Social Justice Adviser to AP Govt Jupudi Prabhakar makes controversial comments over BR Ambedkar Jupudi Prabhakar: జూపూడి ప్రభాకర్ వింత వ్యవహారం! అంబేడ్కర్‌పై వివాదాస్పదంగా కామెంట్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/5fe89d8a284aea6f4d29007933135d6f1708234602856234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jupudi Prabhakar Comments on Ambedkar: ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన ప్రభుత్వాన్ని సమర్థిస్తూ.. అంబేడ్కర్ ను చులకనగా చేసి మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కంటే తమకు డబ్బే ముఖ్యం అని జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ విదేశీ విద్య పేరును జగన్ విదేశీ విద్యగా మార్పు చేసిన విషయంపై జూపూడి ప్రభాకర్ మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ఆ విషయంలో తమకు అభ్యంతరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. జూపూడి ప్రభాకర్. జగన్ మోహన్ రెడ్డి కేవలం తన పేరు కోసమే అంబేడ్కర్ పేరును తొలగించారని చెప్పారు.
అయితే, జూపూడి ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై అంబేడ్కర్ మద్దతుదారులు, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ నిలువెత్తు అంబేడ్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన ఆయన స్ఫూర్తి వైసీపీ నేతలకు అబ్బుతుందా? అని విమర్శలు చేశారు. జూపూడి ప్రభాకర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)