Sajjala on Chandrababu: టీడీపీ నేతలకు పైత్యం బాగా పెరిగింది, అన్ని తప్పుడు వార్తలే - చంద్రబాబు
Andhra News: అమరావతిలో ఆయన నవంబర్ 27 సజ్జల మీడియాతో మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకుండా తాము అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవని అన్నారు.
Sajjala Ramakrishna Reddy: జగన్మోహన్ రెడ్డి హాయాంలో తాము రూ.2.60 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను పక్కాగా అమలు చేశామని చెప్పారు. అమరావతిలో ఆయన సోమవారం (నవంబర్ 27) మీడియాతో మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకుండా తాము అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వారు ధ్రువీకరిస్తేనే టీడీపీ (TDP News) వారు సంక్షేమ పథకాలు అందించేవారని విమర్శించారు.
అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని పథకాలు, అన్ని వర్గాల వారికి అమలు చేశామని పేర్కొన్నారు. మాటకు కట్టుబడి అమలు చేసిన నాయకుడు సీఎంజగన్ అని సజ్జల తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ప్రజలు గమనించారని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సవాల్ విసిరారు.
‘‘జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తు్న్న ఎల్లో మీడియాపై కూడా సజ్జల స్పందించారు. వార్తలను వార్తల్లాగా కాకుండా ఓ వర్గానికి అనుకూలంగా ఉంటున్నాయని విమర్శించారు. 2014-18 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని.. టీడీపీ పెట్టిన వంద పథకాలు ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నాడు కనీసం ఒక పథకాన్ని అయినా బాబు పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉచితంగా ఇసుక అని ఊదరగొటగ్టారని.. ఇసుక ఉచితమైతే దెందలూరు ఎమ్మెల్యే ఎమ్మార్వో వనజాక్షితో ఎందుకు అలా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.
ఇసుక ఉచితమైతే.. జేసీబీలు ఎవరు పెట్టారని.. ఎన్‌జీటీ వంద కోట్ల పెనాల్టీ ఎందుకు వేసిందని నిలదీశారు. చంద్రబాబు పెట్టిన పథకాలు ఉంటే కదా జగన్ వచ్చి తీసివేయడానికి. ఇసుక అక్రమ దందాలో అందినకాడికి టీడీపీ నేతలు దోచుకున్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతీచోటా ఇసుక దందా చేసింది టీడీపీనే అని అన్నారు.
యాత్రకు విపరీత స్పందన
వైఎస్ఆర్ సీపీ చేపడుతున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందని అన్నారు. టీడీపీ నేతలు మాత్రం.. సభల్లో ఖాళీ కూర్చీలు కనిపిస్తున్నాయని అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. సాధికార యాత్రకు వచ్చే స్పందన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు తట్టుకోలేక ఇలా చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలకు పైత్యం బాగా పెరిగిపోయి ఇలాంటి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా తమకు వచ్చిన తరహాలో స్పందన రాదని అన్నారు. అంతా స్వచ్ఛందంగా తరలివచ్చేస్తున్నారని, తమకు అందిన సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా వీరంతా యాత్రకు వస్తున్నారు’ అని సజ్జల అన్నారు.