అన్వేషించండి

AP News: మంగళగిరి చేనేతకు అరుదైన గౌరవం, ప్రధాని మోదీతో వర్చువల్ భేటీకి ఏపీ చేనేత కార్మికులు

National Handloom Day 2023 : చేనేతరంగంలో విశిష్ట కృషి చేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. 

National Handloom Day 2023: మన దేశం పేరు చెప్పగానే విదేశాలకు గుర్తొచ్చే విషయాలలో చేనేత కళ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పట్టణాలు చేనేతకు పేరు గాంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం పేరు చెబితే ఠక్కున్న గుర్తొచ్చే పట్టణం మంగళగిరి. ఇక్కడి చేనేత కళాకారులు, చేనేతన్నలు తయారు చేసే చీరలు, ఇతర ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మంగళగిరి చేనేతకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. మంగళగిరి చేనేతకు జీఐ గుర్తింపు (GI Tag for Mangalagiri Sarees) సైతం లభించింది. 

చేనేతరంగంలో విశిష్ట కృషి చేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. ఆగస్టు 7న చేనేత కార్మికులకు పెద్ద పండగ లాంటిది. ఎందుకంటే ఆరోజు దేశ వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day 2023) ఘనంగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికులతో ఆన్ లైన్ వేదికగా మాట్లాడనున్నారు. ఇందుకోసం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు దేశ వ్యాప్తంగా చేనేతకు ఫేమస్ అయిన ప్రాంతాల్లో పర్యటించాయి. దేశంలోని 75 మంది చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ కానున్నారు. 

చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులను ఎంపిక చేయడంలో భాగంగా ఓ టీమ్ మంగళగిరికి వచ్చింది. చేనేత కార్మికులు కోసం నిర్మిస్తున్న మగ్గం షెడ్లు, చేనేత భవన సముదాయాన్ని కేంద్ర జౌళి శాఖ నుంచి వచ్చిన టీమ్ క్షుణ్ణంగా పరిశీలించింది. చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న చేనేత నేస్తం పథకం అమలు, లబ్ది జరిగే తీరుపై అధికారులు ఆరా తీశారు. మంగళగిరిలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉండటం, ప్రాచీన కళ, సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని భావించిన టీమ్ మంగళగిరి నేతన్నను ప్రధాని మోదీతో ఇంటరాక్షన్ కోసం ఎంపిక చేయడం విశేషం. దేశంలోని మిగతా నియోజకవర్గాల తరహాలోనే మంగళగిరికి సంబంధించి చేనేతన్నలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ గురించి కేంద్ర జౌళి శాఖ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సమాచారం అందించింది. కార్యక్రమం వివరాలు తెలిపింది.

తన నియోజకవర్గానికి చెందిన నేత కార్మికులతో ప్రధాని మోదీ ఆన్ లైన్‌లో మాట్లాడేందుకు మగ్గం షెడ్ల ప్రాంగణాన్ని రెడీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి యోచిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని చేనేత కార్మికులను ఎంపిక చేసి ప్రధాని మోదీతో మాట్లాడేందుకు పేర్లు కేంద్ర జౌళిశాఖకు పంపించాలని అధికారులకు సూచించారు. ఏపీ చేనేత కార్మికుడు, అందులోనూ తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో రాష్ట్రానికి గుర్తింపుగా భావిస్తున్నారు. 

2015లో ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. జాతీయ చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget