గుడ్ న్యూస్! గుంటూరు-తిరుపతి, గుంటూరు-రాయగడ రైళ్లలో భారీ మార్పులు, కోచ్‌ల పెంపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రెండు రైళ్లకు అదనపు కోచ్ లను శాశ్వతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రెండు రైళ్లకు అదనపు కోచ్ లను శాశ్వతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
1. గుంటూరు – తిరుపతి – గుంటూరు రైలు (17261/17262) - ఈ గమ్య స్థానాల మధ్య నడిచే రైలుకు అదనంగా కోచ్‌లు జోడించాలని దక్షిణ మధ్య రైల్వై నిర్ణయం తీసుకుంది. గతంలో 19 కోచ్‌లు ఉండేవి. అదనంగా పెంచిన కోచ్ లతో గుంటూరు - తిరుపతి - గుంటూర మధ్య నడిచే రైలు 01-AC II టైర్ కోచ్, 03-AC III టైర్ కోచ్‌లు, 14- స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 04- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 02-SLR కోచ్ లతో మొత్తం 24 కోచ్‌లతో ఈ రైలు నడవనుంది. గుంటూరు నుండి డిసెంబర్ 18, 2025 నుండి నడవనుండగా , తిరుపతి నుండి డిసెంబర్ 19, 2025 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
2. గుంటూరు – రాయగడ – గుంటూరు రైలు (17243/17244) - ఈ గమ్య స్థానాల మధ్య నడిచే రైలు లోను మార్పులు చేశఆరు. ఈ రైలు గతంలో 20 కోచ్ లు ఉండేవి. పెంచిన కోచ్ లతో ఈ రైలు ఇక నుండి నడవనుంది.
ఈ రైలు కూర్పులో మార్పులు చేశారు.
సవరించిన కూర్పు ప్రకారం (Revised Composition) గుంటూరు - రాయగడ - గుంటూరు మధ్యలో01-AC II టైర్ కోచ్, 03-AC III టైర్ కోచ్‌లు, 14- స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 04- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 02-SLR కోచ్ లతో మొత్తం 24 కోచ్‌లతో నడవనుంది. గుంటూరు నుండి డిసెంబర్ 20, 2025 నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, రాయగడ నుండి డిసెంబర్ 21, 2025 తేదీ నుండి పెంచిన కోచ్ లతో రైలు నడవనుంది.
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ (A. Sridhar, Chief Public Relations Officer)ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు - తిరుపతి - గుంటూరు మధ్య నడిచే ఈ రైలును, గుంటూరు - రాయగడ - గుంటూరు మధ్య నడిచే రైలు కోచ్ లు పెంచడం వల్ల ప్రయాణికులకు లబ్ధి చేకూర్చుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.





















