(Source: ECI/ABP News/ABP Majha)
Nara Lokesh: ‘‘ఇదే రియల్ వెన్నుపోటు, పక్కా ప్రూఫ్స్ ఇవిగో’’ నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
ఆనాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్ సీపీ లీడర్లు అదే పనిగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ మాటలకు కూడా టీడీపీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడం, తదనంతర పరిణామాల్లో వెన్నుపోటు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించడంపై తెలుగు దేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రభుత్వ తీరును తప్పుబడుతుంటే, అధికార పార్టీ నాయకులు అందుకు దీటైన కౌంటర్లు వేస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్ సీపీ లీడర్లు అదే పనిగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ మాటలకు కూడా టీడీపీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ కూడా స్పందించారు.
ట్విటర్ వేదికగా నారా లోకేశ్ ఘాటుగా స్పందిస్తూ.. అసలైన వెన్ను పోటు ఇదే అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులను పేటీఎం డాగ్స్ అంటూ ట్విటర్ లో సంబోధించారు. ఇదే నిజమైన వెన్నుపోటు అంటూ.. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తనయుడు జగన్ అప్పట్లో ముద్దాయిని చేశారని ఆరోపించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అప్పటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగనే తండ్రి వైఎస్ఆర్ ను ప్రథమ ముద్దాయిగా నిలబెట్టారని ఆరోపణ చేశారు.
‘‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే.’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే. pic.twitter.com/NE3B4Qc7OO
— Lokesh Nara (@naralokesh) September 26, 2022
అధికారులు కెరీర్ నాశనం చేసుకోవద్దు - లోకేశ్
మరో ట్వీట్ లో ‘‘తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు ఎందుకు తప్పు చేశాం అని జీవితాంతం బాధపడటం ఖాయం.’’ అని లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు.(1/3) pic.twitter.com/nDekyuyQHK
— Lokesh Nara (@naralokesh) September 24, 2022
41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సిఐడి అధికారుల పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదు.(2/3)
— Lokesh Nara (@naralokesh) September 24, 2022