అన్వేషించండి

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కొడాలి నాని. జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా అంటూ ఎద్దేశా చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. చంద్రబాబుకు జైల్లో సరైన  సౌకర్యాలు కల్పించడంలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. అంతేకాదు.. చంద్రబాబే విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జితో తన బాధ చెప్పుకున్నారు. జైల్లో దోమలు  కుడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. చంద్రబాబుపై సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి  కొడాలి నాని సంగతి ఇక చెప్పక్కర్లేదు. ప్రత్యర్థులపై డైలాగ్‌లు విసరడంలో ఆయన దిట్ట. ఇక అవకాశం దొరికితే చంద్రబాబు, లోకేష్‌ను వదిలేస్తారా... మాటలతో ఉతికి  ఆరేశారు.

చంద్రబాబుపై కక్షపూరితంగా కేసు పెట్టారన్న ఆరోపణలను ఖండించారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు.  చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ శాసనసభ్యులుగా పనిచేశారని... ఒకరు అధికార పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తే.. ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. 40 ఏళ్ల నుంచి రెండు కుటుంబాలు విరుద్ధమైన పార్టీల్లో ఉన్నాయని..అప్పుడెప్పుడూ లేని వ్యక్తిగత కక్ష ఇప్పుడెందుకు వస్తుందని ప్రశ్నించారు కొడాలి నాని. అంటే చంద్రబాబు వ్యక్తిగత కక్షతోనే.... కాంగ్రెస్‌తో కలిసి ఆనాడు జగన్‌ను అరెస్ట్‌ చేయించారా అని అడిగారు. అప్పుడు సోనియా గాంధీ జగన్‌ను అరెస్టు చేయించిన దాంట్లో చంద్రబాబు బాగస్వామ్యం కూడా ఉందా అని నిలదీశారు. అప్పుడు చంద్రబాబు అలా చేశారని... ఆయనపై కక్ష పెట్టుకుని ఇప్పుడు జైలు పంపారని భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు కొడాలి నాని. ఆయనపై వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుందో చంద్రబాబే చెప్పాలన్నారు. తన జోలికి వస్తే ప్రత్యర్థులకే మైనస్‌ అవుతుందని అనుకున్నారని... అందుకే వైఎస్‌ఆర్‌ కూడా ఏమీ చేయలేకపోయాడని బీరాలు పలికాడని అన్నారు. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయి జైల్లో కూర్చున్నాడని ఎద్దేవా చేశారు కొడాలి నాని. 

నారా లోకేష్‌పై కూడా డైలాగ్‌ వార్‌తో విరుచుకుపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు అరెస్ట్‌తో లోకేష్‌... తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడినా బిత్తర చూపులు చూస్తున్నారని సెటైర్‌  వేశారు. తాము గానీ, తమ ముఖ్యమంత్రి గానీ లోకేష్‌ పేరును చిత్తుకాగితంపై కూడా రాయమని అన్నారు. కొడుకు రాజకీయాల్లోకి వచ్చాకే చంద్రబాబు జైలుకు వెళ్లాడని  అన్నారాయన. గతంలో తండ్రి కమీషన్‌ కొట్టేస్తే...లోకేష్‌ వచ్చాక సాంతం దోచేశారని ఆరోపించారు. లోకేష్‌ మళ్లీ పాదయాత్రకు వెళ్తున్నాడని సీఐడీ అధికారులు  రాత్రంతా కూర్చుని 2వేల పేజీలు తయారుచేసి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఇరికించారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు కొడాలి నాని. ఎన్ని ఎక్కువ కేసులు  ఉంటే... అంత పెద్ద నామినేటెడ్‌ పదువులు ఇస్తారని ఆరోపించిన లోకేష్‌.. ఇప్పుడు మా నాన్నపై ఎక్కువ కేసులు పెడుతున్నారని ఎందుకు గగ్గోలు పెడుతున్నారని  ప్రశ్నించారు. లోకేష్‌కు నామినేషన్‌ పదవి వద్దా అని నిలదీశారు కొడాలి నాని. 

ప్రతి రిమాండ్‌ ఖైదీకి జ్యుడిషియల్‌ కస్టడీ ఉంటుందని... అందుకు చంద్రబాబు అతీతుడు కాదన్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే కోర్టులో పిటిషన్‌ వేసుకుంటే వెసులుబాటు  కల్పిస్తారని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే జైల్లో సౌకర్యాలు కల్పిస్తారని.. అయినా వేడినీళ్లు ఇవ్వడంలేదు, దోమలు కుడుతున్నాయని మాట్లాడుతున్నారని  మండిపడ్డారు. జైల్లో దోమలు కుట్టక రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారా ఏంటి..? అని సెటైర్‌ వేశారు కొడాలి నాని. చంద్రబాబు... దోమలపై దండ్రయాత్ర చేసినందుకు అవన్నీ  పగబట్టి ఉంటాయని చెప్పారు. కత్తి పట్టుకుని దోమల కోసం తిరిగాడు కదా.. జైల్లో చాకు తీసుకుని దోమల్ని పొడవాల్సింది అంటూ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు 23 సీట్లకు పరిమితమై పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా పారిపోయాడని... సాంతం సంకనాకి పోయి ఎవరిమీదనో  ఆధారపడి బతకాల్సిన పరిస్థితిలో ఉన్న చంద్రబాబుపై తమకు కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు కొడాలి నాని. 74ఏళ్ల వయస్సులో కాటికి కాళ్లు చాపుకున్న ఆయన...  కనీసం కుప్పంలో కూడా గెలవలేని చంద్రబాబుపై వ్యక్తిగత కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయినా... నేరం చేయకుండానే ఎవరినైనా ఎందుకు జైల్లో  పెడతారని ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు గతంలో 10 నుంచి 15 శాతం కమీషన్‌ తీసుకుని బతికేవాడని.. ఇప్పుడు కొడుకు, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఈ  కమిషన్‌ చాలక మొత్తం దోచేశారని అన్నారు. కుటుంబ సభ్యులు చేసిన స్కామ్‌కి.. చంద్రబాబు బలై జైళ్లో ఉన్నాడని అన్నారు కొడాలి నాని. 

వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి...చంద్రబాబు హయాంలో జరిగిన స్కామ్‌ల గురించి వివరిస్తూనే ఉందన్నారు కొడాలి నాని. ఇన్నర్‌ రింగ్ రోడ్డు, రాజధానితో పాటు అన్నింటిలో  కుంభకోణాలు జరిగాయన్నారు. తన జోలికి ఎవరూ రానని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారని.. అందుకే నీ బాబే ఏం చేయలేకపోయాడు..నువ్వేం చేస్తావ్‌ అంటూ బీరాలు  పలికాడని అన్నారు. బాలయ్య డైలాగ్‌లా ఫ్లూట్‌ జింక ముందు ఊదాలి కాని... సింహం ముందు ఊదుతారా అని బదులిచ్చారు కొడాలి నాని. చంద్రబాబు పార్టీ మళ్లీ  అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే మాకు లేదని.. అలాంటప్పుడు ఆయనపై కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు కొడాలి నాని. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు  పెడుతున్నారని... బాబుతో నేను అంటే.. ఆయనతో పాటు జైలుకు వెళ్లాలా..? అని సెటైర్‌ వేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
PVC Aadhaar Card: క్రెడిట్‌ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్‌ కార్డ్‌ - ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ చేయొచ్చు
క్రెడిట్‌ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్‌ కార్డ్‌ - ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ చేయొచ్చు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Embed widget