![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guntur News: చెట్టు నరికిన విద్యుత్ అధికారులు - ఇళ్లలో కాలిపోయిన గృహోపకరణాలు, 25 లక్షల నష్టం!
AP News in Telugu: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ చెట్టు విద్యుత్ వైర్లపై పడి.. నిప్పులు చెలరేగాయి. దీంతో సమీపంలోని ఇళ్ళలోని విద్యుత్ పరికరాలు షాట్ సర్క్యూట్ అయి కాలిపోయాయి.
![Guntur News: చెట్టు నరికిన విద్యుత్ అధికారులు - ఇళ్లలో కాలిపోయిన గృహోపకరణాలు, 25 లక్షల నష్టం! Guntur News Electricity officials cuts tree and Electrical equipment in nearby houses got shot circuit and burned Guntur News: చెట్టు నరికిన విద్యుత్ అధికారులు - ఇళ్లలో కాలిపోయిన గృహోపకరణాలు, 25 లక్షల నష్టం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/14e74762af4948eb2a87aad32d7c2a581709742388084234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tadepalli News: గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ శాఖ అధికారులు చేసిన పని పలువురికి ఆగ్రహం తెప్పించింది. దీంతో నిర్లక్ష్యం నీడలో విద్యుత్ శాఖ ఉందంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. సంబంధం లేని స్థలం కోసం విద్యుత్ శాఖ అధికారులు చెట్టు నరికినట్లుగా చెబుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఆ చెట్టు విద్యుత్ వైర్లపై పడి.. నిప్పులు చెలరేగాయి. దీంతో సమీపంలోని ఇళ్ళలోని విద్యుత్ పరికరాలు షాట్ సర్క్యూట్ అయి కాలిపోయాయి. అలా అన్ని ఇళ్లలో కలిపి సుమారు 25 లక్షల రూపాయల పరికరాలు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. దీనిపై మండల స్థాయి అధికారిని అడగ్గా అదేదో చిన్న పోరపాటు జరిగిందని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలే ఎండా కాలంలో నీడను ఇచ్చే చెట్టును నరకడం ఏంటని.. స్థానికులు వాపోయారు. తమ విద్యుత్ పరికరాలకు నష్ట పరిహారం ఏవరు చెల్లిస్తారో సమాధానం చెప్పాలని బాధితులు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే పోలీస్ స్టేషన్ ఫిర్యాదుతో పాటు విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు రెడీ అవుతామని బాధితులు వార్నింగ్ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)