అన్వేషించండి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ సబ్ కేటగిరి అమలులో ముందడుగు- కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

Chandra Babu: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Sub-Classification of Scheduled Castes: ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) విస్తతస్థాయి ధర్మాసనం కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏపీలో అమలు చేసేందుకు ప్రభుత్వం రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోంది. జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) నిర్ణయించారు. అలా అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు.

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ
ఎస్సీ(SC) వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించిన వెంటనే తెలుగు రాష్ట్రాలు స్వాగతించాయి. ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Reavanth ReddY) ప్రకటించడమేగాక...ఇప్పటికే విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనల్లోనూ దీన్ని చేర్చుతామని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు సైతం ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయించారు.

బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు తొలి నుంచీ మద్దతుగా ఉన్న టీడీపీ(Telugu Desam)...అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ ఎస్సీ నేతలకు సైతం ఇదే విషయాన్ని అంతర్గత భేటీలో చెప్పారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో ఉప కులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలుచేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు(Chandra Babu) నేతలకు సూచించారు. దీని ప్రకారం ఏ జిల్లాల్లో ఏ ఉపకులం జనాభా ఎంత ఉంటే అంత దామాషా ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తున్నారు.దీనివల్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ రిజర్వేషన్లు పొందడం వంటి సమస్యలు ఉత్పన్నంకావని తెలిపారు.  చంద్రబాబు సూచనకు నేతలంతా ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ నిర్ణయానికి టీడీపీ పొలిట్‌బ్యూరో ఆమోదముద్ర వేసింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న దళిత నేతలెవ్వరూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. 

Also Read:త్వరలో జన్మభూమి 2 - నామినేటెడ్ పోస్టుల లిస్ట్ రెడీ - టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు


కీలక నిర్ణయాలు
టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు మానసపుత్రిక, టీడీపీకి ప్రజల్లో అత్యంత పేరు తీసుకొచ్చిన జన్మభూమి కార్యక్రమాన్ని మళ్లీ తీసుకురానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. జన్మభూమి-2 పేరిట తీసుకొచ్చే ఈ కార్యక్రంలో ఈసారి పెద్దఎత్తున ప్రవాస భారతీయులను భాగస్వాములను చేయాలని యోచిస్తున్నారు. ఇక్కడే పుట్టి విదేశాలకు వెళ్లి బాగా సంపాదించిన వారు తమ స్వగ్రామాలకు ఏదైనా మంచి కార్యం తలపెట్టాలని యోచిస్తున్నారని...ఇటీవల తనను కలిసిన వారంతా ఇదే అభిప్రాయం వెల్లడించారని చంద్రబాబు చెప్పారు. వారి సాయం తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మరోసారి జన్మభూమి కార్యక్రమం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.  ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టాలంటే అందరి సహకారం అవసరమని చెప్పారు. అందుకే అందరినీ భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.

Also Read: దక్షిణాది హక్కులు కాపాడేందుకు చంద్రబాబు రెడీ - డీ లిమిటేషన్‌పై సౌత్‌ను ఏకం చేయబోతున్నారా ?

కష్టపడిన వారికే పదవులు
నామినేటెడ్‌ పదువులు సైతం ఈసారి ఆచితూచి ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. గత ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలే లబ్ధి చేకూర్చేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని తేల్చి చెప్పారు. సిఫార్సులు ఏవీ పనిచేయవని...ఇప్పటికే గ్రామాలవారీగా సర్వే చేయించామని తెలిపారు. ప్రజలు సూచించిన నేతకే పదవులు దక్కుతాయన్నారు. కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget