అన్వేషించండి

YS Jagan: చంద్రబాబుకు అన్నీ భయాలే, అందుకే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు - జగన్

YS Jagan News: పథకాల అమలు విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్రంలో ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తుందని జగన్ విమర్శించారు. భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు.

YS Jagan on Chandrababu: ఏపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్‌లో మరో సుదీర్ఘ పోస్టు చేశారు. ఏపీ ప్రభుత్వం అన్నింటికి భయపడుతోందని.. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలం అయిందని జగన్ ఆరోపించారు. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా చంద్రబాబు భయపడుతున్నారని జగన్ విమర్శించారు.

‘‘కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.  అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేక పోతోంది.  దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుంది.

ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే..,  పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న “భయం’’, ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో.., ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ‘‘భయం’’. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారు.

ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది. కాబట్టి, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి!. కానీ, ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత  ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు.

ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గర్లోనే ఉంది. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ.. ప్రొటెస్ట్‌ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంతో, మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తాం’’ అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG DSC Results: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
HYDRA: రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
Tirumala Bramhosthavam: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG DSC Results: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
HYDRA: రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
Tirumala Bramhosthavam: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Nepal Floods: నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం
నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం
Helene Storm: అమెరికాలో హెలీన్ విలయానికి 95 మంది మృత్యువాత-ఇంకా అంధకారంలోనే లక్షలాది ఇళ్లు
అమెరికాలో హెలీన్ విలయానికి 95 మంది మృత్యువాత-ఇంకా అంధకారంలోనే లక్షలాది ఇళ్లు
Cancer and diet : క్యాన్సర్​కు ఆహారపు అలవాట్లే ముఖ్యకారణమా?
క్యాన్సర్​కు ఆహారపు అలవాట్లే ముఖ్యకారణమా?
Embed widget