అన్వేషించండి

House Lands: ఏపీ సర్కార్ ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోబోమంటున్న లబ్ధిదారులు, ఏకంగా 95 వేల మంది! ఎందుకిలా?

ఈ విషయం గురించి అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మొత్తం 95,106 మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో తాము ఇల్లు కట్టుబోమని చెబుతున్నారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఇళ్ల స్థలాలు పొందిన కొందరు లబ్ధిదారులు అందులో ఇల్లు కట్టుకొనేందుకు నిరాకరిస్తున్నారు. దాదాపు 95 వేల మంది లబ్ధిదారులు తమకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోబోమని చెబుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. లబ్ధిదారులకు దక్కిన ఇళ్లు అప్పటికే నివాసం ఉంటున్న ప్రాంతాలకు దూరంగా ఉండడం, శ్మశానాలు, కర్మాగారాలకు దగ్గరగా ఉండడంతో లబ్ధిదారులు అక్కడ ఇల్లు నిర్మించుకొనేందుకు ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తమకు మరోచోట స్థలాలు కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారని అధికారులు చెప్పారు. అయితే, ఇప్పుడు వీరందరికీ ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించడంపై ప్రభుత్వం సందిగ్ధతలో పడినట్లు తెలుస్తోంది. అందు కోసం దాదాపు రూ.800 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది.

‘‘లబ్ధిదారులు కోరినట్లుగా చేయాలంటే మేం అదనంగా 2 వేల ఎకరాల భూమిని ప్రైవేటు యజమానుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇంతకుముందు మేం లబ్ధిదారులకు ఇచ్చినదంతా ప్రభుత్వ భూమి’’ అని గృహ నిర్మాణశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

సీఎం జగన్ దృష్టికి సమస్య

ఈ విషయం గురించి అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మొత్తం 95,106 మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో తాము ఇల్లు కట్టుబోమని చెబుతున్నారని వివరించారు. ఇంతకుముందు ఒక్కో లబ్ధిదారుడికి ఒకటిన్నర సెంట్ల స్థలం ఇచ్చారు. అయితే, ఇలా ఇల్లు కట్టుకోబోమని మొండికేస్తున్న వారిలో కనీసం 30 శాతం స్థలాలు శ్మశానాలకు సమీపంలో ఉండడం లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 30 శాతం కేసులు పల్లెలు లేదా పట్టణాలకు చాలా దూరంగా ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు.

ఈ సమస్యను కొంత వరకూ పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించారు. కొన్ని జిల్లాల్లో రెండు లేదా మూడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఒకే లే అవుట్ లో స్థలం కేటాయించారు. అది కూడా ఊరికి దూరంగా ఉండడంతో లబ్ధిదారులు తమ ఊర్లోనే తమకు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఇల్లు కట్టుకోబోమని చెబుతున్న వారు 50 వేల మంది మాత్రమే ఉన్నారని, వారి సమస్య పరిష్కరిస్తామని గృహ నిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడామని వారికి మరో చోట భూములు గుర్తించడానికి సర్వే చేయించాలని ఆదేశించినట్లుగా చెప్పారు. ఒక్కసారి సర్వే పూర్తయ్యాక భూమి సేకరించి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. 

‘‘రాష్ట్రంలో మొత్తం 30.3 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల పట్టాలు అందించాం. అందులో కేవలం 1.5 శాతం అంటే 50 వేల లబ్ధిదారులు వేర్వేరు కారణాల వల్ల తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని కోరారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ కు చెప్పారు. దీంతో లబ్ధిదారులకు వారికి కావాల్సిన చోట స్థలం చూపించి వారికి 100 శాతం సంతృప్తి కలిగేలా పని చేయాలని చెప్పారు. సీఎం సూచనల ప్రకారం మేం వారి కోసం పని చేస్తున్నాం. లబ్ధిదారులు కోరుతున్న చోట భూములను గుర్తించేందుకు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అది పూర్తయ్యాక భూములను సేకరించి, లబ్ధిదారులకు మొత్తం స్థలాలు వారు కోరుకున్నచోట కేటాయిస్తాం’’ అని గృహ నిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ బీఎం దివాన్ మిదీన్ వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget