అన్వేషించండి

AP PRC: పీఆర్సీపై ఎటూ తేలని పంచాయితీ.. ప్రభుత్వంతో మళ్లీ అసంపూర్తిగా ముగిసిన చర్చలు

జనవరి నెలకు గానూ పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని సూచించింది. అయితే, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది.

మంత్రులతో కూడిన ప్రభుత్వ స్టీరింగ్ కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వ కమిటీ ఎదుట పీఆర్సీ సాధన సమితి నేతలు మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని కోరింది. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. జనవరి నెలకు గానూ పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని సూచించింది. అయితే, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. దీంతో మూడు డిమాండ్లపై చర్చించుకొని చెబుతామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అప్పటి వరకూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని వారికి సూచించింది.

అంతకుముందు ప్రభుత్వం మరోసారి పీఆర్సీ సాధన సమితి నేతలతో భేటీ అయింది. దాదాపు గంటన్నర సమావేశమైన ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాక, ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

హైకోర్టులో ఉద్యోగులకు ఊరట
మరోవైపు, ఉద్యోగులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించి న పీఆర్సీ చట్ట విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఉన్న "జీతాల రికవరీ" అంశాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. పీఆర్సీలో  ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్న ఆందోళన కనిపించింది. 

అయితే ప్రభుత్వం  జీతాలు తగ్గబోవని చెబుతోంది. రికవరీ చేసినప్పటికీ జీతాలు తగ్గవని హామీ ఇస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను తక్కువగా నిర్ణయించడం.. హెచ్‌ఆర్‌ఏను తగ్గించడం, ఇప్పటికే ఇచ్చిన ఐఆర్ నుంచి నాలుగు శాతం వెనక్కి తీసుకోవడం వంటి చర్యల వల్ల తగ్గిపోయే ఉద్యోగుల జీతాన్ని పెండింగ్‌లో పెట్టిన డీఏలన్నింటినీ మంజూరు చేయడం ద్వారా కవర్ చేయాలని నిర్ణయించింది. నిజానికి డీఏలకు పీఆర్సీకి సబంధం లేదు. కానీ ప్రభుత్వం తమ పీఆర్సీ ఉద్యోగులకు నష్టం లేదన్న భావన కలిగించడానికి డీఏలను పీఆర్సీలో కలిపి ప్రకటించింది. దీంతో ఉద్యోగుల జీతాల నుంచి కట్ అయ్యే రికవరీ తక్కువే. కానీ డీఏల రూపంలో రావాల్సిన ప్రయోజనాలన్నీ పోతాయి. 

ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడీ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది. ఉద్యోగులకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఈ పీఆర్సీ ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ రెండు సార్లు విచారణ వాయిదా పడింది. ఇవాళ డివిజనల్ బెంచ్ ముందు విచారణ జరిగింది. జీతాల రికవరీ  వద్దని హైకోర్టు చెప్పడంతో ఉద్యోగులకు డీఏ ఎరియర్స్  వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget