AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు షాక్! మాజీ ఐఏఎస్ పిటిషన్‌పై ఈ 8న విచారణ
Andhra Pradesh News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ 8న హైకోర్టులో విచారణ జరగనుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం, ప్రభుత్వ నిధులు, భద్రతా సిబ్బంది, అధికార వాహనాలను సినిమా ప్రమోషన్‌కు వినియోగించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఆగస్టు 19న దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతూనే సినీ కార్యక్రమాల్లో పాల్గొనడం అనైతికమని, ఆయనపై స్వతంత్ర దర్యాప్తు ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.
ప్రభుత్వ న్యాయవాది పలు అభ్యంతరాలు
ఈ మేరకు గత నెలలో మొదటిసారి విచారణ జరిగిందని, తదుపరి విచారణలో రాష్ట్ర హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడాన్ని ఆమె ప్రశ్నించారు. కాగా, న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప్, కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆ పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు.
పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకుంటారా.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ
తాజాగా, హైకోర్టు ఈ కేసును సెప్టెంబర్ 8న విచారించనున్నట్లు ప్రకటించింది. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. నేరం రుజువైతే పవన్ కల్యాణ్‌పై చర్యలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. ఇక సోమవారం జరిగే విచారణలో ఏం జరగబోతుందన్న విషయంపై ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉత్కంఠ నెలకొంది. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లు, ఈవెంట్ సందర్భంగా ప్రభుత్వ వాహనాలతో పాటు భద్రతా సిబ్బందిని వినియోగించారని విజయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఐఏఎస్ ఏపీ కోర్టును ఆశ్రయించారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లు, విడుదల సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రయాణించిన వాహనంపై ఏపీ డిప్యూటీ సీఎం అని రాసి ఉండటం సైతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఆ వాహనానికి ఏపీ డిప్యూటీ సీఎం అధికారిక వాహనాలకు ఏ సంబంధం లేదని అదే సమయంలో క్లారిటీ ఇచ్చారు.






















