అన్వేషించండి

విద్యా శాఖలో వర్కింగ్ గ్రూప్, సీఎం జగన్ నిర్ణయం - భవిష్యత్ టెక్నాలజీ టీచింగ్ పై సర్కార్ ఫోకస్

భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్‌ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.

ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు

భవిష్యత్ టెక్నాలజీ విద్యపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్‌ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్‌ టెక్‌ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటుచేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవనవరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్‌ గ్రూపు నివేదిక ఇవ్వనుంది.

సీఎం జగన్ జగన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. 

విద్యా రంగంలో పెనుమార్పులు
 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 41 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, మాథమెటిక్స్ సబ్జెక్టుల్లో బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్‌ కూడా ఏర్పాటుచేసింది. 

సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ తో బోధన మరింత సులువు 
2021-22 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ విద్యార్థులకు ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని అందించింది. ఇంగ్లీష్ భాషలో సందేహాల నివ్రత్తికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయి. అదేవిధంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్‌ డిక్షనరీలను సైతం అందజేసింది. కాగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ప్రక్రియ విద్యార్థుల బోధనలో కీలకమార్పుగా పరిగణించవచ్చు. ఈ విధానం వల్ల విద్యార్థులకు బోధన మరింత సులభతరమైంది. 

బైజూస్ తో బ్రైట్ ఫ్యూచర్ అంటున్న సర్కార్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సైన్స్‌, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో సైతం ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరింత సులువుగా, సమర్థంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్‌ రూపంలో బైజూస్‌ కంటెంట్‌ను విద్యార్థులకు అందించింది.  దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందజేసి అందులో బైజూస్‌ కంటెంట్‌ యాప్‌ను లోడ్‌ చేశారు.  పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు.

డిజిటల్ బోధనకు శ్రీకారం
 పాఠశాలల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. నాడు-నేడు పనులు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్స్‌ ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్‌ టీవీలను సైతం ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో డిసెంబర్‌ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌టీవీల ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్‌ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

వర్కింగ్ గ్రూపుల ఏర్పాటుకు శ్రీకారం 
ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకమని భావించిన ప్రభుత్వం ఆదిశగా అనేక చర్యలు చేపట్టింది. భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌, ఎల్‌ఎల్‌ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్‌ ఛాట్‌ జీపీటీ, వెబ్‌ 3.O, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ, వర్చువల్‌ రియాల్టీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సెంట్ర్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ, అటానమస్‌ వెహికల్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, గేమింగ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  

విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్‌ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్‌ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్‌ గ్రూపు ఖరారు చేయనుంది.

వర్కింగ్ గ్రూపులో సభ్యులు వీరే 
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వర్కింగ్ గ్రూప్ కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్‌గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.  స్కూలు ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్‌ చద్దా, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇండియాకు చెందిన షాలినీ కపూర్‌, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్‌ ఏసియాకు చెందిన షాలినీ కపూర్‌, నాస్కాం ప్రతినిధి, సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎకానమీ పాలసీ రీసెర్చ్‌ అధ్యక్షుడు జైజిత్‌ భట్టాచార్య, నీతి ఆయోగ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 

జూలై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్‌ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ ప్రతిపాదనలు అమలులోకి వస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీఎం భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget