అన్వేషించండి

AP Government: ప్రభుత్వ ఖాళీ స్థలాల ఆక్రణకు గురి కాకుండా ప్రభుత్వం ప్లాన్- లీజ్‌కు ఇవ్వాలని అధికారులు ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు ఎన్నో ఉన్నాయో గుర్తించి.. అవి అన్యాక్రాంతానికి గురికాకుండా సత్వరమే వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు మంత్రి దాడిశెట్టి రాజ.

వాణిజ్య ప్రాంతాల్లో రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లీజుపై ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్వహణ పనుల ప్రగతి సమీక్షించారు. 

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు ఎన్నో ఉన్నాయని, అవి అన్యాక్రాంతానికి గురికాకుండా ఉండేందుకై వాటిని సత్వరమే వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు దాడిశెట్టి రాజ. విజయనగరం, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవన నిర్మాణాలను ఇప్పటికే చేపట్టామన్నారు. అదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భవన నిర్మాణాలు చేపట్టేవా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా కాని పక్షంలో ఆయా స్థలాలను లీజుపై వినియోగించుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్నారు. తద్వారా రోడ్లు, భవనాల ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకనే అవకాశాలు ఏర్పడతాయన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రగతిలో ఉన్న రోడ్ల పనులను వేగవంతం చేయాలని, వాటి నాణ్యతలో ఎటువంటి రాజీలేకుండా చూడాలని అధికారులను మంత్రి దాడిశెట్టి రాజ ఆదేశించారు. ప్రగతిలోనున్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తాను స్వయంగా పర్యటిస్తానని అధికారులకు మంత్రి తెలిపారు. తమ పర్యటన ప్రారంభమయ్యేలోపు ఇంజనీరింగ్ అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. రోడ్ల మరమ్మత్తు, నిర్వహణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 

కాలపరిధిని పెంచకుండా ఒప్పందం ప్రకారం పి.హెచ్.సిల నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి రాజ సూచించారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన అతిథి గృహాలకు చాలా చోట్ల సెక్యూరిటీ లేకపోవడంతో వాటి నిర్వహణ అధ్వానంగా తయారైందన్నారు. అవుట్ సోర్సింగ్‌పై వాచ్‌మెన్‌లను, అటెండర్లను నియమించుకునేందుకు ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి సర్య్కులేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 

రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులను సి.ఎఫ్.ఎం.ఎస్.లో అప్లోడింగ్ చేయడంలో చాలా జాప్యం జరుగుతోందన్నారు మంత్రి రాజ.  ఈ జాప్యాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా బిల్లుల అప్‌ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సాంకేతిక సిబ్బంది కొరత వల్ల పూర్తయిన రోడ్ల పనులకు సంబంధించిన ఫీల్డ్‌ మెజర్‌మెంట్ పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాల్లోని సాంకేతిక సిబ్బంది సేవలు ఇందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అలా ప్రభుత్వ అనుమతి పొందేందుకు ఫైల్‌ సర్క్యులేట్ చేయాలన్నారు మంత్రి. 

రోడ్లు, భవనాల శాఖలో ప్రత్యేకించి రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి దాదాపు 2 వేల కేసులు కోర్టులో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉండటాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ఆ కేసుల సత్వర పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్లీడర్‌కు అదనంగా మరో ప్లీడర్‌ను నియమించుకునేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతించాల్సినదిగా కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులకు మంత్రి సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget