అన్వేషించండి

AP News: ఏపీలో దేవాలయాల వర్గీకరణ, ఆదాయానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు: మంత్రి కొట్టు

Kottu Satyanarayana: ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల వర్గీకరణను త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ తెలిపారు.

Kottu Satyanarayana: త్వరలో దేవాలయాల వర్గీకరణ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల ఆదాయంలో పురోగతి కనిపిస్తుందని ఆయన చెప్పారు.

ఆదాయానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు
ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల వర్గీకరణను త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువ అయిందని, అందుకు అనుగుణంగానే వాటి ఆదాయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తున్నదన్నారు. అయితే ప్రస్తుతం దేవాలయాలకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా భక్తులకు పలు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆదాయానికి అనుగుణంగా వాటి వర్గీకరణను  రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో నున్న దేవాలయాలను వాటి ఆదాయాన్ని బట్టి మూడు కేటగిరీలుగా విభజించి అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు రీజనల్ జాయింట్ కమిషనర్ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. 
ఆదాయం ఎంతుంటే అంతలా...
 15 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం లోపు దేవాలయాలను అసిస్టెంట్ కమిషనర్, రూ.50 లక్షల కు పైబడి రూ.1.00 కోటి లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను డిప్యూటీ కమిషనర్, రూ.1.00 కోటి కి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షణలో ఉంచుతున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే  ఇప్పుడు ఆ మూడు కేటగిరీల ఆదాయ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆద్వర్యంలో ఉండే దేవాలయాల ఆదాయ పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.7.00 కోట్ల లోపు, డిప్యూటీ కమిషనర్ ఆద్వర్యంలోని దేవాలయాల ఆదాయ పరిమితిని రూ.7 కోట్లకు పైబడి రూ.12 కోట్ల లోపు,  రూ.12.00 కోట్ల ఆదాయానికి మించిన దేవాలయాలను  జాయింట్ కమిషనర్ ఆద్వర్యంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని  వెల్లడించారు. ఈ వర్గీకరణ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 5 వరకూ, డిప్యూటీ కమిషనర్ పోస్టులు 15 వరకూ పెరగనున్నాయని, ఒక రీజనల్ జాయింట్ కమిషనర్ పోస్టు తగ్గనుందని ఆయన తెలిపారు.  అయితే ఇందుకు గాను అదనంగా పోస్టులను మంజూరు చేయాల్సిన పని లేదని, ప్రస్తుతం మంజూరు కాబడిన క్యాడర్ స్ట్రెంగ్తు  అధికారులతోనే ఈ పోస్టులను సర్థుబాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. 

హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా... 
రాష్ట్రంలో  గ్రేడ్-1,2 & 3 దేవాలయాలు ఉండేవని, హైకోర్టు ఆదేశాల మేరకు రూ.5 లక్షలలోపు ఆదాయం ఉండే దేవాలయాల నుండి ఎగ్జిక్యూటివ్ అధికారులను ఉపసంహరించనున్నట్లు తెలిపారు. అటు వంటి ఆలయాలకు చెందిన ఆస్తుల పరిరక్షణ, భూముల వేలం తదితర కార్యక్రమాలను స్థానికంగా ఉండే దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అయితే ఆ దేవాలయాల నిర్వహణ కార్యక్రమాలను అర్చకులు గాని లేదా దేవాలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గాని నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 లక్షలోపు ఆదాయం ఉన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయో పున సమీక్ష చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget