అన్వేషించండి

CRDA Meeting: క్వాంటం వ్యాలీలో అత్యాధునిక పరికరాల కోసం ఒక ప్రత్యేక భవనం - సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్

Quantum Valley: 'క్వాంటం వ్యాలీ'లో అత్యాధునిక పరికరాల కోసం ఓ భవనాన్ని నిర్మించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP CRDA construct special building in Quantum Valley : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ** 65వ సీఆర్డీయే (CRDA) అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ నిధులను కేటాయించారు.  
 
అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా 'క్వాంటం వ్యాలీ'లో అత్యాధునిక పరికరాల  కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. రెండు ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 43,000 చదరపు అడుగుల్లో  103.96 కోట్ల రూపాయలతో  ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయడమే కాకుండా, క్వాంటం వ్యాలీలో మరో రెండు అదనపు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.                   

అమరావతికి భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా చేసేందుకు భారీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు పనులతో పాటు, గుంటూరు ఛానల్ ద్వారా అదనంగా 4 వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా మరో 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను 443 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే LPS జోన్ 8లో మౌలిక సదుపాయాల కోసం 1,351 కోట్లు మంజూరు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది.  కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో భారీ ఆసుపత్రి, యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం 60 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు  750 కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం ఇక్కడ వైద్య సేవలను అందుబాటులోకి తేనుంది. దీనితో పాటు ఐఏఎస్ అధికారుల బంగ్లాల ఇంటర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం  109.52 కోట్లు విడుదల చేయడానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.                                  

రాజధాని ప్రాంతంలోని రైతులకు సంబంధించిన జరీబ్, నాన్ జరీబ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ సమస్యల పరిశీలన కోసం జిల్లా స్థాయి అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా అథారిటీ ఆమోదించింది.           

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget