అన్వేషించండి

గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇవ్వండి - కోవిడ్ పై సమీక్షలో సీఎం జగన్

గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇవ్వటంతో పాటుగా నివారణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇవ్వటంతో పాటుగా నివారణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.
కోవిడ్ పై ముఖ్యమంత్రి సమీక్ష...
వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌19 తాజా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులపై అధికారులు జగన్ కు నివేదికను సమర్పించారు. కరోనా వ్యాపిస్తుందని కేంద్రం సూచనలు చేయడంతో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్న వారికి కోవిడ్‌19 సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు తెలిపారు. కోవిడ్ తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. కొవిడ్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే ర్యాపిడ్‌ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ నుండి వచ్చిన నివేదక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రిపోర్ట్ లను ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామన్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఫీవర్‌ సర్వేలో కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. ఆక్సిజన్‌ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు జగన్ ఆదేశించారు.
విమానాశ్రయాల్లో శాంపిల్స్ సేకరణ...
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల నుంచి ర్యాపిడ్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో ఏర్పాట్లు చేశామని అధికారులు జగన్ కు వెల్లడించారు. ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్‌ వ్యవస్థ కోవిడ్‌ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌కూ టెస్టింగ్‌ కిట్స్, మందులు పంపించాలని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్న సీఎం, ల్యాబులను అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకోవాలని అన్నారు.
మెడికల్ కాలేజీలపై జగన్ ఆరా..
జిల్లాల వారీగా కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి వెల్లడించారు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులను వేగవంతం చేశామని అన్నారు. పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్, వైఎస్సార్ కడపలో జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ విభాగంతో సహా మూడు బ్లాకుల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే పూర్తిగా సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget